‘మానాడు’ వంటి సైన్స్‌‌ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్‌ను రూపొందించిన దర్శకుడు వెంకట్ ప్రభు.. ఇప్పుడు అక్కినేని నాగ చైతన్యతో మూవీ చేస్తున్నారు. NC22 పేరుతో చిత్రీకరిస్తున్న బుధవారం నుంచి సెట్స్‌లోకి వెళ్లనుంది. నాగ చైతన్యకు జంటగా కృతిశెట్టి నటించనుంది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజతోపాటు ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా కూడా సంగీతం అందిస్తున్నారు.


యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రకటన పోస్టర్‌లో నాగ చైతన్య లుక్‌ను పూర్తిగా రివీల్ చేయలేదు. చీకట్లో ఉన్న చైతూ యూనిఫామ్‌ ధరించినట్లు తెలుస్తోంది. అలాగే, అతడిపై లేజర్ గన్స్ గురిపెట్టినట్లు ఉంది. ‘థాంక్యూ’ మూవీ తర్వాత చైతూ రూటు మార్చినట్లు తెలుస్తోంది. ఈసారి థ్రిల్లర్‌తో రక్తికట్టించేందుకే ఈ చిత్రానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 


కృతిశెట్టికి మళ్లీ మరో పెద్ద ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసింది. అయితే, ఆమె వరుస పరాజయాలు అక్కినేని అభిమానులను కలవరపెడుతోంది. కృతిశెట్టి, నాగ చైతన్య నటించిన ‘బంగార్రాజు’ మూవీ మంచి విజయమే సాధించింది. ఆ తర్వాత నాగ చైతన్యకు, కృతిశెట్టికి ఒక్క హిట్ కూడా దక్కలేదు. ముఖ్యంగా కృతిశెట్టి నటించిన ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలు ఆశించిన విజయం సాధించలేదు. అలాగే చైతూ బాలీవుడ్ చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. NC22తో తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. దీంతో చైతూ, కృతిశెట్టి ఇప్పుడు తమిళ ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. 










Also Read : ఈ వారం థియేట్రికల్ - ఓటీటీ రిలీజెస్ ఇవే!


Also Read : ‘జైలర్’ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం! నిజంగానే రజనీ మూవీ నుంచి తప్పుకుందా?