తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో తీరిక లేకుండా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా రెండు రోజుల వ్యవధిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో రెండు సార్లు సమావేశం అయ్యారు. రెండు సార్లు కూడా సుదీర్ఘంగా సమావేశం కావడం తెలంగాణ రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.  మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగిన సమావేశంలో  పాల్గొనేందుకు కేసీఆర్ రెండు రోజుల ముందుగానే ఢిల్లీ వెళ్లారు. ఆదివారం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షానే అధ్యక్షత వహించారు. సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్ అమిత్ షా నివాసానికి వెళ్లారు. గంటన్నర పాటు చర్చలు జరిపారు. 


Also Read : ఏం సంబంధం ఉందని వైఎస్ఆర్‌సీపీ కోసం శక్తికి మించి పని చేశా ! జగన్ నిరాదరణపై కలకలం రేపుతున్న షర్మిల వ్యాఖ్యలు !


సోమవారం కూడా ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ ఉదయం కొంత మంది కేంద్రమంత్రుల్ని కలిసినా మళ్లీ మధ్యాహ్నం హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లారు. మరోసారి గంటన్నర పాటు చర్చలు జరిపారు. చర్చల ఎజెండా ఏమిటో స్పష్టత లేదు కానీ ఇలా రోజు మార్చి రోజు అమిత్ షాతో సమావేశం అయి చర్చించారంటే ఏదో అత్యంత కీలకమైన విషయమే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ పరంగా తెలంగాణ అంశాలు చర్చించారన్న విషయాన్నీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సాధారణంగా కేసీఆర్ ఇలాంటి భేటీలు నిర్వహించారంటే ఏదో అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఏదో తీసుకోబోతున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంటుంది. ఇప్పుడు రెండు సార్లు భేటీ అయినా గత వారమే ఆయన ఢిల్లీ పర్యటనలో చర్చలు జరిపారు. ఇలా వరుస భేటీలు రాజకీయమేనన్న చర్చ ప్రారంభమైంది. 


Also Read : నేటి చీఫ్ సెక్రటరీలు రేపటి సలహాదారులు ! ఏ సేవలకు ఈ ప్రతిఫలాలు ?


కేసీఆర్ ఏదైనా అనుకుంటే దాన్ని పూర్తి స్థాయిలో అమల్లో పెట్టే వరకూ బయటకు తెలియనివ్వరని టీఆర్ఎస్ వర్గాలు చెబుతూ ఉంటాయి. అమిత్ షాతో అలా గంటల తరబడి చర్చలు జరుపుతున్నారంటే.. రాజకీయంగా అత్యంత క్లిష్టమైన విషయంపైనేనని వినిపిస్తోంది. అదేమిటో అటు బీజేపీ వైపు నుంచి కానీ ఇటు టీఆర్ఎస్ వైపు నుంచి కాని స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే ప్రభుత్వ పరమైన విషయాలు ఇలా మాట్లాడే అవకాశం లేదని అంటున్నారు.  


Also Read : టిక్కెట్ రేట్లా ? ఆన్ లైన్ టిక్కెట్లా ? ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు పేచీ ఎక్కడ ?


తెలంగాణలో వరదల పరిస్థితి తీవ్రంగా ఉంది. ఓ వైపు  వరదల పరిస్థితిని సీఎస్ సోమేష్ కుమార్‌తో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరో వైపు కేంద్రమంత్రులతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారంటే త్వరలో తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందన్న వాదన ప్రారంభమైంది. 


Also Read : స్వరూపానంద వ్యతిరేకత ! ఆ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి