Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేస్తున్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇళ్లు, ఫామ్ హౌస్‌లపై ఐటీ దాడులు దాడులు చేస్తున్నారు. అలాగే బడంగ్ పేట మేయర్ పారిజాత నరసింహారెడ్డితో పాటు మరికొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులపైనా గురి పెట్టారు. వీరిలో బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. ఎన్నికల ముంగిట ఇలా ఐటీ దాడులు చేయడం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.
బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయన్న రేవంత్
బీజేపీతో కలిసి బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓటమి భయంతో కాంగ్రెస్ అభ్యర్థులను భయ పెట్టే ఉద్దేశంతోనే ఐటీ దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మేడిగడ్డ వద్ద కుంగిపోయిన బ్యారేజీని పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సాయం చేస్తామన్న వ్యాపారులను.. బీఆర్ఎస్ సర్కార్ బెదిరిచిందని గతంలో ఆరోపించారు. ఇప్పుడు బీజేపీతో కలిసి బీఆర్ఎస్ పార్టీనే ఆర్థికంగా బలమైన తమ అభ్యర్థులను టార్గెట్ చేసిందని ాయన ఆరోపిస్తున్నారు.
ఐటీ దాడులతో సంబంధం లేదన్న కిషన్ రెడ్డి
మరో వైపు తెలంగాణ లో జరుగుతున్న ఇన్ కంట్యాక్స్ దాడులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో టిక్కెట్ల కసరత్తును పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగివచ్చిన ఆయన.. ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు. ఐటీ దాడులను బీజేపీ చేయిస్తోందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు తెలంగాణలో జరుగుతున్న ఐటీ రైడ్స్‌తో బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ... ఈ సోదాలు కొత్తగా ఏం జరగడం లేదని అన్నారు. గతంలోనూ పలు చోట్ల తనిఖీలు చేశారని పేర్కొన్నారు.ఐటీ అధికారులకు తమ వద్ద ఉన్న సమాచారం మేరకు సోదాలు చేస్తారని గుర్తు చేశారు.
సబిత దాడులు చేస్తున్నరని మేయర్ పారిజాత ఆరోపణ
మరో వైపు ఓటమి భయంతోనే మంత్రి సబిత ఐటీ దాడులు చేయిస్తున్నారని బడంగ్ పేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం నుంచి కేఎల్ఆర్‌కు టిక్కెట్ ప్రకటించినప్పటికీ మార్పు చేసి తమకు టిక్కెట్ ఇవ్వాలని ఆమె హైకమండ్ వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఉండగా ఐటీ దాడుల గురించి తెలిసింది దీంతో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. సబితపై ఆరోపణలు చేసారు. మహేశ్వరం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ బీఫాం కోసం చూస్తున్నామని.. చెబుతున్నారు. ఐటీ దాడులకు భయపడేది