PM Modi Arrives in Begumpet Airport : ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు వచ్చారు. ప్రధాని మోదీ శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకుని విశ్వరూప సభకు హాజరై ప్రసంగించనున్నారు. ప్రధాన మంత్రి మోదీ టూర్ సందర్భంగా హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.


పీఎం మోదీ ఎన్నికల ప్రచారానికి మరోసారి హైదరాబాద్ కు విచ్చేశారు. వారం వ్యవధిలో ప్రధానమంత్రి తెలంగాణకు రావడం ఇది రెండోసారి. శనివారం (నవంబర్ 11న) సాయంత్రం ప్రధానమంత్రి మోదీ పర్యటన వేళ హైదరాబాద్‌ పోలీసులు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలంతా ఈ రూట్‌లలో వెళ్లకుండా ప్రత్యమ్నాయ రూట్‌లోను ఎంచుకోవాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. 


ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాలు 
ప్లాజ్‌ ఎక్స్‌ రోడ్స్‌, టివోలి క్రాస్‌ రోడ్స్‌ మధ్య దారిని పూర్తిగా మూసివేయనున్నారు. 
సంగీత్‌ ఎక్స్‌ రోడ్స్‌ మీదుగా బేగంపేట వైపు వెళ్లే వెహికల్స్‌ ప్యాట్నీ ప్యారడైజ్‌, సీటీవో రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది. రసూల్‌పుర మీదుగా బేగంపేట చేరుకోవాల్సి ఉంటుంది. 
అదే రూట్‌లో సంగీత్‌ ఎక్స్‌ రోడ్స్ వైపు వెళ్లాల్సిన వెహికల్స్‌ను బాలమ్‌ రాయ్‌, బ్రూక్‌బాండ్‌, తివోలి, స్వీకార్‌ ఉపకార్‌, వైఎంసీఏ, సెయింట్‌ జాన్సన్‌ రోటరీ వైపుగా మళ్లిస్తారు. 
బోయిన్‌పల్లి, తాడ్‌బన్‌ నుంచి టివోలి వైపుగా వెళ్లేవారి వెహికల్స్‌ను బ్రూక్‌ బాండ్‌ నుంచి సీటీఓ, రాణిగంజ్‌ వైపుగా టర్న్‌ తీసుకోవాల్సి ఉంటుంది. 
ప్యాట్నీ నుంచి ఎస్‌బీఐ‌, స్వీకార్‌ ఉపకార్‌ రూట్‌లో వెహికల్స్‌ రాకపోకలను నిషేధించారు. 
తిరుమలగిరి ఆర్టీఏ, కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్‌గూడ నుంచి ఫ్లాజా వైపు వెళ్లే వాహనాలను తివోలి వద్ద నుంచి స్వీకార్‌ ఉపకార్‌, వైఎంసీఏ రూట్‌లో వెళ్లనిస్తున్నారు. 
జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి బేగంపేట వెళ్లాల్సిన వెహికల్స్‌ను పంజాగుట్ట, ఖైరతాబాద్‌, గ్రీన్‌లాండ్‌, రాజ్‌భవన్‌ మీదుగా రూట్ చేస్తున్నారు. 


తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ హైదరాబాద్ వస్తున్న ప్రధానమంత్రి పరేడ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గోనున్నారు. దీనికి బీజేపీ లీడర్లు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. బీసీ నినాదంతో ఎన్నకల బరిలో ఉంటున్న బీజేపీ నాలుగు రోజుల క్రితమే పరేడ్ గ్రౌండ్స్‌లో బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో మీటింగ్ పెట్టారు. ఇప్పుడు మరోసారి ప్రధానమంత్రి మోదీ వస్తున్న వేళ ఎలాంటి ప్రకటన చేస్తారనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. అయితే ఈసారి ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన ఉండొచ్చని బీజేపీ లీడర్లు చెబుతున్నారు.