CM KCR :  వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి రైతు ప్రభుత్వం రాబోతుందని సీఎం కేసీఆర్ తెలిపారు.  పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్‌ నూతన కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.  గుజరాత్‌ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను మోసంచేసి అధికారంలోకి వచ్చారన్నారు. అన్నింటిపై పన్నులు వేసి ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు.  


జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా? 


సింగరేణిలో ఎన్ని వేల మందికి ఉద్యోగాల దొరుకుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. రామగుండం పట్టణాన్ని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసుకున్నామన్నారు. పెద్దపల్లి, సుల్తానా, మంతెన పట్టణాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసున్నామన్నారు.  26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నాయకులు తనను కలిశారని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ఉన్న ఏ కార్యక్రమం కూడా వాళ్ల రాష్ట్రాల్లో  అమల్లోలేవన్నారని తెలిపారు. వాళ్లంతా తనను తప్పనిసరిగా జాతీయ రాజకీయాల్లోకి రమ్మంటున్నారన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామా అని సీఎం కేసీఆర్ గట్టిగా చెప్పడంతో బహిరంగ సభ హోరెత్తింది. 


కల్తీ మద్యం ఏరులై పారుతోంది 


"గాంధీ పుట్టిన గుజరాజ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అన్నారు. కానీ కల్తీ మద్యం ఏరులై పారుతోంది. దీనికి సమాధానం చెప్పాలి? తెలంగాణలో ఉన్న ఏ పథకం కూడా గుజరాత్‌లో లేదు. అక్కడ 24 గంటల విద్యుత్ లేదు. మంచినీళ్లు రావు. దేశాన్ని దోచే దోపిడీ గాళ్ల బూట్లు మోసే సన్నాసులు ఇక్కడ కనిపిస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవంతో ఉందామా? లేక దిల్లీ నుంచి వచ్చే వాళ్లకు గులాం అవుదామా?. ఇరవై ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన నేతలు నన్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలనికోరారు. కేంద్రం ధాన్యం కొనడం లేదు. ప్రధాని చేతకానితనంతో మాట్లాడుతున్నారు. బియ్యం, నూకలు, గోదమపండికి కూడా కరవు వస్తోంది." - సీఎం కేసీఆర్  


మత విద్వేషాలు 


దేశ ఆర్థిక స్థితి రోజురోజుకీ దిగజారిపోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దేశం స్థితి ఏంబాగాలేదన్నారు. బీజేపీ నేతలు మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో నెత్తురు పారాలా? నీళ్లు పారాలా? అని ప్రశ్నించారు. ప్రజల మధ్య విభేదాలు రేపేవాళ్లకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.  రైతులకు మేలు చేస్తే, రైతుల కూలీలకు పెన్షన్ ఇస్తే, ప్రజలను ఆదుకుంటే వద్దంటూ కేంద్రం ఆంక్షలు పెడుతోందన్నారు. సింగరేణి ప్రజలంతా పిడికిలి ఎత్తాలని, బీజేపీ ముక్త భారత్‌ కోసం శ్రమించాలన్నారు. అప్పుడే దేశం బాగుపడుతుందని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ మేధావులు ప్రజలను జాగృతం చేసి దేశానికి కాపాడటానికి అన్ని రకాలుగా ముందుకు పోవాలన్నారు. 


రైతుల ప్రభుత్వం 


రేపు రాబోయే ఎన్నికల్లో రైతుల ప్రభుత్వం వస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు. గోల్‌మాల్ ప్రధాని కేంద్రమంత్రి చెప్పేది పచ్చి అబద్దం అన్నారు.  దేశంలో ఉన్న రైతులు వ్యవసాయానికి వాడే కరెంట్‌ 27.80 శాతమే అని, దాని ఖరీదు రూ.1.45 వేల కోట్లు మాత్రమేనన్నారు. ఒక కార్పొరేట్‌ సంస్థకు దోచిపెట్టినంత కాదని ఎద్దేవా చేశారు. వ్యవసాయ బోర్లకు ఎందుకు మీటర్లు పెట్టాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నరేంద్రమోదీకి రైతులంతా కలిసి మీటర్ పెట్టాలన్నారు.  దేశంలో ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధి జరగలేదన్నారు.  12 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు కట్టబెట్టారన్నారు. శ్రీలంకకు వెళ్లి మోదీ దోస్తులకు దోచిపెట్టడానికి, బిజినెస్‌లు ఇప్పించారని విమర్శించారు. మొట్టమొదటిసారి మోదీ గోబ్యాక్ అంటూ ఆ దేశంలో ప్రజలు నినదించారన్నారు. ఇక్కడ చెప్పులు మోసే వాళ్లు కూడా సమాజాన్ని కలుషితం చేసే పనిచేస్తున్నారన్నారు. 


Also Read : Mid Manair: మిడ్ మానేర్ నిర్వాసితుల మహాధర్నా, ఎక్కడికక్కడ అరెస్టులు - రేవంత్, బండి సంజయ్ ఫైర్