BJP Janasena :   జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, తెలంగాణ  బీజేపీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. రెండు పార్టీల మధ్య పొత్తుల అంశంపై పార్టీ హైకమాండ్ తో చర్చలు  జరిపే అవకాశం ఉంది. తెలంగాణలో జనసేనతో పొత్తులు పెట్టుకుని పోటీ చేయాలని బీజేపీ నిర్ణయిచుకుంది. గత వారం.. హైదరాబాద్ లో పవన్  కల్యాణ్ నివాసంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమావేసం అయ్యారు. ఆ తర్వాత ఈ అంశంపై హైకమాండ్ తోనూ చర్చలు జరిపారు. తాజాగా జనసేనకు కేటాయిచే స్థానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. 


గత వారం పవన్ కల్యాణ్‌తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చర్చలు                    


జనసేన పార్టీ 32 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటోందని ఆ జాబితాను పవన్ కల్యాణ్ విడుదల చేశారు. అయితే బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వ్చచి చర్చలు జరిపినప్పుడు.. పోటీ చేయకుండా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలన్న అంశాన్ని ప్రస్తావించారు. కానీ..  తెలంగాణలో కనీసం 30 స్థానాల్లో పోటీ చేయకపోతే, జనసేన పార్టీ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుందని పవన్ కల్యాణ్ బీజేపీ నేతలకు  వివరించారు. బిజెపి అగ్రనేతల అభ్యర్థన మేరకు గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ) ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా ఉండి బిజెపి అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు కృషి చేసిందని గుర్తు చేశారు. ఈ సారి అలాంటి పరిస్థితి లేదన్నారు. 


జనసేనకు కొన్ని సీట్లు ఇచ్చేందుకు హైకమాండ్ అంగీకారం                             


పవన్ కల్యాణ్ తో జరిగిన  చర్చల వివరాలను కిషన్ రెడ్డి ఇప్పటికే హైకమాండ్ కు వివరించారు. దీంతో  జనసేనకు పన్నెండు స్థానాలు కేటాయిస్తారని ఢిల్లీలో వర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో ఏ ఏ స్థానాలు కేటాయిస్తారన్న అంశంపైనా చర్చ ఓ జాబితా సర్క్యూలేట్ అయింది. కానీ అది నిజం కాదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఎన్డీయేలో భాగంగా కొనసాగుతోంది. కానీ కలిసి పోటీ చేసే విషయంలో మాత్రం ఇటీవలి కాలం వరకూ వారు చర్చించలేదు. ఎన్నకిల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే.. జనసేన మద్దతు తీసుకోవడం లేదా.. కలసి పోటీ చేయడంపై బీజేపీ నిర్ణయం తీసుకుంది. 


ఇప్పటికే తాము  పోటీ చేసే స్థానాలని 32 స్థానాల జాబితా ప్రకటించిన జనసేన 


తెలంగాణలోని కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్‌, నాగర్‌కర్నూల్‌, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లా లాపూర్‌, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్‌, కొత్తగూడెం, ఉప్పల్‌, అశ్వరావుపేట, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్ నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ తూర్పు, మల్కాజిగిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిర, నర్సంపేటతో సహా మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ఈ నెల ప్రారంభంలో జనసేన ప్రకటించింది. వీటిలో చాలా నియోజకవర్గాలకు బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్నారు.అందుకే జనసేనతో పొత్తు కుదిరితే  బీజేపీ ఇచ్చే సీట్లపైనా ఆసక్తి ఏర్పడింది.