TS Panchayat Funds :   తెలంగాణలో ప్రభుత్వం పంచాయతీల నిధుల్ని మళ్లించిందనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా.. కేంద్రం ఇస్తున్న ఆర్థిక సంఘం నిధులు కూడా తెలంగాణ ప్రభుత్వం మళ్లించుకున్నదని సర్పంచులు ఆందోళన చేస్తున్నారు.  ఓ ఉపసర్పంచి ఆత్మహత్య  చేసుకున్నారు.  సర్పంచులు రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పంచాయతీ నిధులను వెంటనే తిరిగి ఇవ్వాలని ఆందోళనలు చేస్తోంది. అసలేం జరుగుతోంది. 


15వ ఆర్థిక సంఘం నిధులు మాయమయ్యాయంటున్న సర్పంచ్‌లు ! 
 
పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తుంది. 15వ ఆర్థిక సంఘం తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కొద్ది రోజుల కిందట నిధులు విడుదల చేసింది. అన్ని పంచాయతీలకు కలిపి ఈ మొత్తం రూ. ఐదు వేల కోట్ల కన్నా ఎక్కువగానే ఉంటుంది. ఈ నిధులు ఇటీవల తెలంగాణ గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి జమ అయ్యాయి. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఈ డబ్బును డ్రా చేసి, ఆయా గ్రామ పంచాయతీల్లోని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించే అధికారం సర్పంచ్‌లకు మాత్రమే ఉంటుంది. కేంద్రం సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ పేరుపై బ్యాంకు ఖాతా తెరిచింది. గ్రామ పంచాయతీ కమిటీ తీర్మానం ఆధారంగా వీరికి ఆ డబ్బు డ్రా చేసే అధికారం ఉంటుంది.  ఇందులో 50 శాతం నిధులు రహదారుల నిర్మాణానికి, మిగిలినవి సంక్షేమం, నిర్వహణకు వెచ్చించాలి. 


సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల ప్రమేయం లేకుండానే నిధులు మాయం !


అయితే కేంద్రం ఇలా జమ చేయడం ఆలస్యం అలా నిధులు మాయం అయిపోయాయి. ప్రభుత్వం తీసేసుకున్నదని సర్పంచులు ఆందోళన బాట పట్టారు. గ్రామాల్లో అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయని... వాటిని చేయాలని అనుకున్నారు. అయితే  వచ్చినవి వచ్చినట్లుగా మాయం కావడంతో వారు నిరాశ చెందుతున్నారు. రాజీనామాలు చేస్తామంటున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. నిధులు తిరిగి ఇవ్వకుంటే ప్రగతి భవన్ తలుపులు బద్దలు కొడతామని  సర్పంచ్‌ల సంఘం హచ్చరికలు జారీ చేస్తోంది.  రాష్ట్ర పంచాయతీ రాజ్‌ అధికారులు.. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు తెలియకుండా, వారి బ్యాంకు ఖాతాల డిజిటల్‌ కీ ఆధారంగా ఈ నిధులను విత్‌ డ్రా చేశారని ఆరోపిస్తున్నారు.  


మళ్లించలేదు - బిల్లులు చెల్లించామంటున్న ప్రభుత్వం 


అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం సర్పంచ్‌లు. విపక్ష నేతలు చేస్తున్న ఆరోపణల్ని ఖండిస్తోంది. ప్రభుత్వ ఖాతాల్లోకి నిమళ్లించలేదు కానీ తామే ఖర్చు చేశామని అంగీకరిస్తోంది.  15వ ఆర్థిక సంఘం నిధులను  పీఎఫ్‌ఎంఎస్‌  ద్వారా ఖర్చు చేయాల్సి ఉంటుందని .. అలాగే ఖర్చు చేశారు కానీ..  రాష్ట్ర ప్రభుత్వ ఖాతాల్లోకి మళ్లించలేదని చెబుతున్నారు.  కేంద్ర ఆర్థిక సంఘం మొదటి విడత నిధులను ఖర్చు చేస్తేనే రెండో విడత నిధులు విడుదల చేస్తామన్నారని అందుకే  ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన బిల్లులను చెల్లించామని ప్రభుత్వం చెబుతోంది. ట్టు వివరించారు.కేంద్రం సైతం 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేస్తున్నదని, నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్ల్లో జమ చేయదని ప్రభుత్వం చెబుతోంది.  కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్‌లను విడుదల చేయడానికి ముందు గ్రామ పంచాయతీలు ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌ ద్వారా నిర్దిష్ట ఖర్చులను రికార్డు చేశాయని చెబుతున్నారు.