Telangana  Panchayat Elections:  తెలంగాణలో  పంచాయతీ రాజ్ సంస్థల  ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశలుగా జరిగే అవకాశం ఉంది.  నోటిఫికేషన్ ఈ నెలా 26 లేదా 27న ప్రకటించనున్నారు. పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు ఫ్రీజ్ కావడంతో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. బీసీ రిజర్వేషన్ల వివాదం కారణం ఇప్పటి వరకూ ఆలస్యం అవుతూ వస్తున్నాయి. 

Continues below advertisement

మొదటి దశ (డిసెంబర్ 11)లో 4,000కు పైగా గ్రామ పంచాయతీలు, 100 MPTCలు కవర్ అవుతాయి. రెండవ దశ (డిసెంబర్ 14)లో మరో 4,000 పంచాయతీలు, మూడవ దశ (డిసెంబర్ 17)లో మిగిలిన 4,769 పంచాయతీల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.  మొత్తంగా 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.   ఈ ఎన్నికలకు 1.67 కోట్ల మంది ఓటర్లు అర్హులు, 1 లక్షకు పైగా అభ్యర్థులు పోటీ పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.  

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు 2020 అక్టోబర్‌లో జరగాల్సినప్పటికీ, BC రిజర్వేషన్ వివాదాలోత ఆలస్యమయ్యాయి. ఆర్టికల్ 243E ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరపాల్సినప్పటికీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం పట్టుదల చూపింది. అయితే  హైకోర్టు జూన్ 2025లో "సెప్టెంబర్ 30 వరకు పూర్తి చేయాలి" అని ఆదేశించింది. అయితే, BC కమిషన్ నివేదికలు, 42% BC కోటా వివాదాలు, సెప్టెంబర్ 2025లో ప్రకటించిన పాత షెడ్యూల్  పై హైకోర్టు స్టే ఇచ్చింది. 

Continues below advertisement

తాజా క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి "గ్రామ పంచాయతీలు మాత్రమే డిసెంబర్‌లో జరుగుతాయి, MPTC/ZPTCలు కోర్టు తీర్పు తర్వాత"  నిర్వహించాలని నిర్ణయించారు.   పంచాయతీలకు రావాల్సిన మూడువేలకోట్ల నిధులు ఆగిపోకుండా పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు.  ప్రజాపాలన వారోత్సవాలు తొమ్మిదో తేదీతో పూర్తవుతాయి. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరిగేలా షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.