Temple in flames due to tourist improper use of candles: చైనాలోని జియాంగ్సు ప్రాంతంలోని ఫెంఘువాంగ్ పర్వతం మీద ఉన్న ప్రసిద్ధ వెంచాంగ్ పవిలియన్ ఆలయం భారీ అగ్నిప్రలయానికి గురైంది.  దీనికి కారణం ఓ భక్తుడు. ఆ ఆలయానికి వచ్చిన భక్తుడు క్యాండిల్స్, అగర్ బత్తీలు సరైన చోట పెట్టకపోవడ ంవల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా నిర్దారించారు.  నవంబర్ 12న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  అగ్నిప్రలయంలో ఆలయం పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ, ప్రాణనష్టం జరగలేదు. చుట్టుపక్కల అడవులకు వ్యాప్తి చెందలేదు.

Continues below advertisement

Continues below advertisement

చైనా ప్రభుత్వ మీడియా సీసీటీవీ ప్రకారం, ఈ ఆలయం యాంగ్క్వింగ్ టెంపుల్ కాంప్లెక్స్‌లో భాగం. 536 ఏడీలో లయింగ్ డైనస్టీలో స్థాపించి ఈ ఆలయం, 1958లో కూల్చివేసి 1990లలో మళ్లీ నిర్మించారు.  ఇది మూడు అంతస్తుల కలిగిన చారిత్రక శైలి ఆకృతి. ఫెంఘువాంగ్ పర్వతం పైభాగంలో ఉండటం వల్ల ఇది పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. అగ్నిప్రమాదం కారణంగా మొత్తం ఆలయం కాలిపోయి కూలిపోయింది.                                                   

 పర్యాటకుడు ఆలయంలో పూజా కార్యక్రమాల సమయంలో  కొవ్వోత్తులు, అగర్ బత్తీలు సరైన మార్గదర్శకాలు పాటించకుండా వాడటం వల్ల మంటలు రగిలాయి. "పర్యాటకుల అబాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల ఈ ప్రమాదం జరిగింది" అని జియాంగ్జియాంగ్ సిటీ అధికారులు ప్రకటించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఫలితాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.                 మూడేళ్ల కిందట  గాన్సు ప్రాంతంలోని శాండాన్ గ్రేట్ బుద్ధ టెంపుల్‌లోనూ ఇలాగే జరిగింది.  అక్కడ కూడా ప్రధాన ఆలయం దెబ్బతిన్నది. చైనాలో పర్యాటకుల సంఖ్య పెరుగుతున్న మధ్య, ఇలాంటి ప్రమాదాలు హెరిటేజ్ సైట్లలో ఎక్కువ అవుతున్నాయి.