Indian Origin Pregnant Woman Killed | సిడ్నీలోని హోర్న్స్‌బీ శివారులో జరిగిన ఘోర ప్రమాదంలో 33 ఏళ్ల భారత సంతతికి చెందిన మహిళ మృతిచెందారు. ఆమె 8  నెలల గర్భిణి అని, ప్రమాదంలో కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయిందని 9 న్యూస్ రిపోర్ట్ చేసింది. శుక్రవారం నాడు తన భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా ఆమెను కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కొన్ని రోజుల్లోనే రెండవ బిడ్డ పుడుతుందని సంతోషంగా ఉన్న సమయంలో కుటుంబంలో విషాదం నెలకొంది. 

Continues below advertisement

ఢీకొనడంతో కారు ముందుకు దూసుకెళ్లింది

న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక కుటుంబం నడుచుకుంటూ వెళ్లడానికి దారి ఇవ్వలేదు. 19 ఏళ్ల ఆరోన్ పాపజోగ్లు ఒక BMW సెడాన్ కియాని ఢీకొనడంతో అది వేగంగా ముందుకు కెళ్లి ధారేశ్వర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను వెస్ట్‌మీడ్ ఆసుపత్రికి తరలించే ముందు ప్రాథమిక చికిత్స అందించారు. ఎంత ప్రయత్నించినా గర్భిణీతో పాటు ఆమె కడుపులో ఉన్న బిడ్డను కాపాడలేకపోయారు.

చాలా భయంకరమైన దృశ్యం

NSW పోలీస్ ట్రాఫిక్ అండ్ హైవే పెట్రోల్ కమాండ్ అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్ ఈ ఘటన దృశ్యాన్ని ఇది "చాలా భయంకరమైనది" అని వర్ణించారు. ప్రజలు మరణించినప్పుడు, అందులో గర్భంలో పిల్లలు కూడా ఉంటే ఇది చాలా విషాదకరం" అని అన్నారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు.

Continues below advertisement

తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్న డ్రైవర్

బీఎండబ్ల్యూ నడిపి ప్రమాదానికి కారణమైన పాపజోగ్లును తప్పనిసరి పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. తరువాత విడుదల చేశారు. అధికారులు డాష్‌క్యామ్ ఫుటేజ్‌ను పరిశీలించిన తరువాత పోలీసులు నిందితుడ్ని వహరూంగాలో అరెస్టు చేశారు. అతన్ని హోర్న్స్‌బీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, ఓ ప్రాణం పోవడానికి కారణమైన ర్యాష్ డ్రైవింగ్, గర్భంలో శిశువు చనిపోవడం వంటి అభియోగాలు నమోదు చేసినట్లు నివేదిక పేర్కొంది. కియా కార్నివాల్‌ను నడుపుతున్న 48 ఏళ్ల వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘోర ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.