RK Rule In Telangana: మాజీమంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతివ్వడాన్ని స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇన్నాళ్లు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ఎన్నికలకు ముందు ఆరోపించిన సీఎం ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. . రాష్ట్రంలో ఆర్కే అంటే రేవంత్ రెడ్డి, కేటీఆర్ పాలన కొనసాగుతోందన్నారు. వినీతికి పాల్పడే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ మోదీ ప్రభుత్వం సహించదు. కచ్చితంగా చర్యలుంటాయన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
అర్బన్ నక్సల్స్, కమ్యూనిస్టు పార్టీలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి నిప్పులు చెరిగారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన అభివ్రుద్ధి కన్పించని కబోధులని అభివర్ణించారు. అమాయకులను రెచ్చగొట్టి ఆయుధాలు చెతపట్టించి వారు చావులకు కారకులైన అర్బన్ నక్సల్స్ సాధించిందేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందని ఆ పార్టీకి మద్దతిస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములయ్యారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాళ్లకు ఏమాత్రం నైతికత ఉన్నా... ఆ పదవులకు రాజీనామా చేసి బయటకు వచ్చి వాస్తవాలు మాట్లాడాలని డిమాండ్ చేశారు.
నగరాల్లో, పట్టణాల్లో ఏసీ రూముల్లో ఉంటూ బూటకపు ఎన్ కౌంటర్ల గురించి మాట్లాడుతున్న సోకాల్డ్ కమ్యూనిస్టులు, అర్బన్ నక్సల్స్ ఎన్నడైనా లొంగిపోవాలని చెప్పారా? వాళ్లు చనిపోయాక మాత్రం బూటకపు ఎన్ కౌంటర్లని మాట్లాడుతూ పాటలు పాడి శవాలకు నివాళి అర్పించడం తప్ప వాళ్లు చేసిందేమిటి?. ఒకవైపు రాజ్యాంగాన్ని కాపాడాలని వాళ్లే ఆందోళనలు చేస్తారు. ఇంకోవైపు అదే రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టి నక్సలిజంలో చేరాలని అమాయకులను రెచ్చగొడతారు? ఇదేం ద్వంద్వ నీతి. అసలు వాళ్లకు స్పష్టత, లక్ష్యం ఉందా? అని ప్రస్నించారు. బీజేపీకి ఒక లక్ష్యం ఉంది. బ్యాలెట్ ను నమ్ముకుని బీజేపీ వరుసగా కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. దాదాపు 20 రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతోంది. కోట్లాది మందికి అభివ్రుద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తున్నం. 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చినం. కోట్లాది మందికి ఉచితంగా రేషన్ సహా సంక్షేమ పథకాల లబ్ది చేకూరుస్తున్నం. ఆర్దిక ప్రగతిలో భారత్ ను 4వ స్థానానికి తీసుకొచ్చి అమెరికా, రష్యా, చైనా, జపాన్ సరసన చేర్చినం. మా లక్ష్యం 2047 నాటికి వరల్డ్ నెంబర్ వన్ దేశంగా భారత్ ను మార్చేందుకు వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్నాం... మరి మీ లక్ష్యం ఏమిటో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎగ్గొట్టారు? భూమలిచ్చారా? ఉద్యోగాలిచ్చారా? నిరుద్యోగ భ్రుతి ఇచ్చారా? మహిళలకు నెలనెలా రూ.2500 లు ఇచ్చారా? వ్రుద్దులకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారా? మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు నచ్చింది ఏమిటి? ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు తీసుకుని భాగస్వాములు అవుతున్నారు.? ఆయుధం పట్టిన వాళ్లకు ఆనందం ఉండదు. జీవితాంతం టెన్షనే. తిండి తిప్పలు లేక కుటుంబ సభ్యులకు దూరమై అల్లాడుతుంటే అర్బన్ నక్సలైట్లు మాత్రం ఏసీ గదుల్లో ఎంజాయ్ చేస్తూ మావోయిజం వర్ధిల్లాలి...తాడిత పీడిత వర్గాలు ఏకం కావాలంటూ మాయ మాటలు చెబుతూ పబ్బం గడుపు కుంటున్నారు. చిన్నపిల్లలకు తుపాకులిచ్చి కాల్చమని చెప్పడం ఏం సిద్దాంతమని ప్రశ్నించారు.