ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పాలిటిక్స్‌లో యువకులు యాక్టివ్ అవుతున్నారు. పలువురు సీనియర్ నాయకుల వయసు రీత్యా ఈసారి ఎన్నికల బరిలో తమ వారసులను దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు సీనియర్ నాయకుల వారసులు వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలపై క్లారిటీ లేకున్నా.. ఇప్పటి నుంచే వారు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. దీంతో జిల్లాలో పొలిటికల్ స్ట్రీట్ లో హీట్ పుట్టిస్తోంది.


బాన్సువాడ నియోజకవర్గంపై పోచారం బ్రదర్స్ ఫోకస్.


బాన్సువాడ నియోజకవర్గం నుంచి సీనియర్ నేత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి జిల్లాలో చాలా సీనియర్ నాయకులు. మొదట టీడీపీలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి టీడీపీ హాయంలో హౌసింగ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పని చేశారు. టీఆర్ఎస్ లో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. ప్రస్తుతం పోచారం శ్రీనివాస్ రెడ్డి వయస్సు కూడా దాదాపు 70 ఏళ్లు ఉంటుంది. పోచారం శ్రీనివాస్ రెడ్డికి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు డాక్టర్. అయితే ఇద్దరు కొడుకులు ఇప్పటికే పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నారు.


సురేందర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి ఇద్దరూ ఈసారి బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. పోచారం సురేందర్‌ రెడ్డి బాన్సువాడ టీఆర్ఎస్ ఇచ్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. భాస్కర్ రెడ్డి ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా ఉన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఈ ఇద్దరు కొడుకులు రాజకీయంగా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. నియోజకవర్గంలో వీరికి మంచి పట్టుంది. అయితే ఎమ్మెల్యే పదవిపై ఇద్దరు కొడుకులు కన్నేయటంతో పోచారానికి కాస్త ఈ వ్యవహారం తలనొప్పిగా మారిందనే చెప్పవచ్చు. కానీ ఇద్దరు మాత్రం నియోజకవర్గంలో ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ వచ్చినా బరిలో దిగేందుకు రెడీగా ఉన్నారు.


బాజిరెడ్డి వారసుడిగా జగన్ మోహన్ రెడ్డి


నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ కొడుకు బాజిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పొలిటికల్ గా యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. 2020 ధర్ఫల్లి జడ్పీటీసీగా గెలిచారు జగన్. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్డి పెట్టారు. బాజిరెడ్డి గోవర్దన్ జిల్లాలో సీనియర్ నాయకులు. ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్మూర్, బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్ఎస్ పార్టీలో చేరాక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం బాజిరెడ్డి  ఆర్టీసీ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. బాజిరెడ్డి గోవర్దన్ తన వారసుడిగా పెద్ద కొడుకు జగన్ ను ఇప్పటికే పాలిటిక్స్ లో ప్రమోట్ చేశారు. రూరల్ నియోజకవర్గంలో జగన్ ప్రజా సంబంధాలను కొనసాగిస్తున్నారు. బాజిరెడ్డి సైతం వచ్చే ఎన్నికల్లో రూరల్ నుంచి ఎమ్మెల్యేగా జగన్ ను బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.


కేశపల్లి గంగారెడ్డి వారసురాలిగా కావ్యా రెడ్డి


జిల్లా రాజకీయాల్లో మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి మంచి పేరున్న నాయకులు. ఆయన రెండు సార్లు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 2004 టీఆర్ఎస్ నుంచి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా గెలిచారు కేశ్ పల్లి గంగారెడ్డి. కేశ్ పల్లి రాజకీయ వారసుడిగా ఆయన కొడుకు ఆనంద్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినా ఆయనకు అంత కలిసిరాలేదు. 2014, 2018లో నిజామాబాద్ రూరల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఏడాది క్రితం ఆనంద్ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. ఈ నేపథ్యంలో కేశపల్లి గంగారెడ్డి కుటుంబం నుంచి  వారసురాలిగా మనువరాలు కావ్యా రెడ్డి రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.