నిజామాబాద్ జిల్లా పొలిటికల్ స్ట్రీట్ హీటెక్కుతోంది. టీఆరెస్ పార్టీలో జిల్లా రాజకీయాల్లో కిరోల్ పోషిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇందూరు జిల్లా కమలం పార్టీలో అన్ని తానై వ్యవహరిస్తున్నారు ఎంపీ అరవింద్. ఈ ఇద్దరి మధ్య నడచి మాటల యుద్ధం జిల్లా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఎప్పుడు ఓపికగా ఉండే ఎమ్మెల్సీ కవిత... ఒక్కసారిగా ఎంపీ అరవింద్‌పై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో అరవింద్ ఎక్కడ పోటీ చేసిన వెంటబడించి ఒడిస్తానన్నారు ఎమ్మెల్సీ కవిత. కవిత ఛాలెంజ్ వెనుక వ్యూహం ఏంటి? వచ్చే ఎన్నికల్లో కవిత ఎంపీగా పోటీ చేస్తారా ఎమ్మెల్యేగా బరిలో ఉంటారా అన్నది జిల్లా పాలిటిక్స్‌లో ఇంట్రస్టింగ్‌గా మారింది. ఇటు ఎంపీ అరవింద్ కూడా కవిత సవాల్ ను స్వీకరించారు. ఇద్దరు నేతల సవాల్ ప్రతి సవాళ్లు అటు ఇరు పార్టీలలో ఓవరాల్ గా జిల్లా రాజకీయాల్లో ఆసక్తిర అంశంగా మారింది.
వచ్చే ఎన్నికల్లో పోటీ అసెంబ్లీకా? పార్లమెంట్‌కా?
కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె పదవి కాలం ఇంకా దాదాపు 4 ఏళ్ళు ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో కవిత బరిలో ఉంటాను అనే సంకేతమైతే ఇచ్చారు. అది కూడా ఎంపీ అరవింద్‌పై పోటీకి రెడీ అంటున్నారు. అరవింద్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ బరిలో ఉండి ఒడిస్తానని ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్‌తో ఎమ్మెల్సీ కవిత ఎంపీగా బరిలో ఉంటారా లేక ఎమ్మెల్యేగానా అన్న సందేహం పార్టీ క్యాడర్‌లో వచ్చింది. సవాల్ చేసినట్టు అరవింద్ ఎంపీగా పోటీ చేస్తే కవిత కూడా ఎంపీగా బరిలో ఉండే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఎంపీగా చేసిన అనుభవం కవితకు ఉంది.
అరవింద్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బరిలో ఉంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన ఆర్ముర్ లేదా కోరుట్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఒక వేళ అరవింద్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కవిత అసెంబ్లీకి మొగ్గు చూపుతారా అన్న ప్రశ్నలు జిల్లా రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. అరవింద్ మాత్రం ఈ సారి ఎన్నికల్లో ఎమ్మెల్యే గా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్సీ కవిత కూడా ఎమ్మెల్యేగా బరిలో ఉంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కవిత నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తారన్నది టీఆరెస్ పొలిటికల్ సర్కిల్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్ నుంచి కవిత బరిలో ఉండాలని పార్టీలో శ్రేణులు అర్బన్ టీఆరెస్ నాయకులు ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో కవిత ఉంటే రాజకీయంగా బాగుంటుందన్నది క్యాడర్ భావన. కవిత ఎంపీగా వస్తారా లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్న క్లారిటీ మాత్రం ఆమె ఇవ్వలేదు. జిల్లా పాలిటిక్స్‌లో మాత్రం కవిత ఎమ్మెల్యేగా అర్బన్ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారమైతే జోరుగా సాగుతోంది.
ఎంపీ అరవింద్, ఎమ్మెల్సీ కవిత ఈ ఇద్దరు తమ తమ పార్టీల్లో కీలక నేతలు. కవిత చేసిన సవాల్‌ను దృష్టిలో పెట్టుకుంటే అరవింద్ ఎమ్మెల్యే లేదంటే ఎంపీగా బరిలో ఉంటే కవిత కూడా ఆయన మీద పోటీ చేయాలి. లేదంటే అధిష్టానం ఆదేశాలను పాటించాలి. రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు కామన్ అని కొందరు లైట్ తీసుకునే వాళ్ళు లేకపోలేరు. చూడాలి మరి ఇందూరు జిల్లాలో ఈ ఇద్దరు కీలక నేతల మధ్య వార్ ఎలా ఉండబోతోందో.