G0 49 Tiger Zone | కాగజ్ నగర్: ప్రజల సంక్షేమం అభివృద్ధి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అనునిత్యం పని చేస్తున్న ప్రజా ప్రభుత్వం, పోడు భూముల సమస్య పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేస్తుందని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని గిరిజనేతర పోడు రైతులను అడ్డుపెట్టుకొని వారి సమస్య మరింత జటిలం చేసేలా సిర్పూర్ నియోజకవర్గంలో కొందరు బిజెపి నాయకులు చేస్తున్న ఉచ్చులో పడొద్దని ఈ సందర్భంగా గిరిజనేతర పోడు రైతులను కోరారు. 

రాష్ట్ర మంత్రులతో సమస్యపై చర్చించాం..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని చింతలమానేపల్లి మండలం దిందా సహా అనేక గ్రామాల్లో నెలకొన్న పోడు వివాదం పరిష్కారానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, రాష్ట్ర మంత్రులు, జిల్లా ఇన్చార్జి మంత్రులతో చర్చించినట్లు తెలిపారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దిందా గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు ప్రభుత్వపరంగా అండగా ఉండి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్ఓఎఫ్ఆర్ చట్టానికి లోబడి మేలు చేస్తామని మరోసారి స్పష్టం చేస్తున్నాం. పోడు భూముల సాగు హక్కు పత్రాల పంపిణీ సామాన్య ప్రజలు రైతులకు చట్టం దాని విధివిధానాలు నియమాలపై వివరించి వారికి న్యాయం జరిగేలా బాధ్యత గల ప్రజాప్రతినిధులు కొందరు రాజకీయ లబ్ధి, ప్రభుత్వాన్ని బద్నాం చేసే దురుద్దేశంతో సమస్య పరిష్కారం కోసం అంటూ ఆందోళనలు నిరసనలకు పిలుపునివ్వడం దురదృష్టకరం అన్నారు.

కేంద్రం ఆధీనంలోనే పూర్తి అజమాయిషిఅటవీ శాఖ మీద అజమాయిషి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. చట్టం ప్రకారం గిరిజనేతర రైతుల కు భూమి ఇప్పించేందుకు అటవీశాఖ జిల్లా రాష్ట్ర అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. సామాన్య పోడు రైతులతో ఎటువంటి సమస్యా లేదు. సమస్య అంతా ఎక్కువ మొత్తంలో అటవీ భూమిని ఆక్రమించి ఉన్న రైతులతోనే వస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు సైతం పలుమార్లు స్పష్టం చేశారు.

చట్టానికి లోబడి సాగు చేసుకునేలా చర్యలు

చర్చల ద్వారానే గిరిజనేతరుల పోడు రైతుల సమస్యకు పరిష్కారం లభిస్తుందనీ, ఈ విషయంలో ఇటికల పహాడ్, జైహింద్ పూర్, ఆడేపల్లి గ్రామాల్లో రైతుల సమస్యను పరిష్కరించిన విషయాన్ని పోడు రైతులు గమనించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనేతర రైతులకు అండగా ఉండి, వారి జీవనాధారమైన పోడు భూమిని సాగు చేసుకునేలా చట్టానికి లోబడి చర్యలు తీసుకుంటామని మరోసారి హామీ ఇచ్చారు. సిర్పూర్ నియోజకవర్గంలోని పోడు రైతులు తమ సమస్య ఇబ్బందిపై ఎప్పుడు వచ్చినా, నన్ను పిలిచినా వస్తాను. రాబోయే రోజుల్లో వాస్తవ విషయాలు పోడు రైతులకు తెలియజెప్పి రాజకీయయాలకతీతంగా మేలు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తానని మరోసారి ప్రకటిస్తున్నాను.

ఇదే సమయంలో రాజకీయ లబ్ధి కోసం గిరిజనేతర రైతులను ముందు పెట్టి ఆందోళన చేసి వాళ్లకు కేసులు మిగిల్చిన నాయకుల మాటలు నమ్మొద్దని కోరుతున్నాను. పోడు రైతుల విషయంలో కేంద్రం వద్దకు సైతం వెళ్తామని, అవసరమైతే బీజేపీ నేతలు ఇళ్ళు సైతం ముట్టడి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. ఆందోళన, నిరసన పిలుపుకు స్పందించి రైతులు నష్టపోవద్దని ఎమ్మెల్సీ దండే విఠల్ మరోసారి విన్నవించారు.