Nirmal Crime News: నిర్మల్ పట్టణం బంగాల్పేట్ కాలనీకి చెందిన నరేష్ నవీన్ ఇద్దరు అన్నదమ్ములు, మంగళవారం వారు తల్లిదండ్రులతో గొడవపడడం జరిగింది. అనంతరం ఇద్దరు ఒకరి వెనుక ఒకరు బంగల్ చెరువు వద్దకు చేరుకొని చెరువులో దూకారు.
స్థానికులు గమనించి విషయం తెలియజేయగా పోలీసులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మొదట నవీన్ మృతదేహం లభ్యమవగా, తదుపరి నరేష్ మృతదేహం చెరువు నుంచి బయటకు తీశారు. అన్నదమ్ములిద్దరూ ఒకేసారి చనిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. నిర్మల్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు।