Jogu Ramanna Fires on CM Revanth Reddy | ఆదిలాబాద్: ఇంద్రవెల్లి ఔన్నత్యం తెలియకుండానే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ గడ్డను ఎన్నికల సభగా మార్చి రాష్ట్ర ప్రజలకు అనేక మోసపూరిత హామీలు ఇచ్చారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. అక్కడ ఇచ్చిన ప్రతి హామీని పూర్తి చేయకుంటే తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని బిఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి, తంతోలి లింగుగూడా గ్రామాలలో వరదలతో నష్టపోయి పంట పొలాలలో నిరాశ్రయులై బాధపడుతున్న రైతులను జోగు రామన్న ఆదివారం నాడు పరామర్శించారు. రైతులు అశోక్  గంజి గాలన్న, మల్లేష్ వినోద్ వెంకన్న గంగన్నల పంట పొలాలను సందర్శించి పంట దెబ్బతిన్న విధానంపై  స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకూ ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందించే దిశగా కృషి చేస్తామన్నారు. 

అనంతరం మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. ఇంద్రవెల్లి గడ్డను ఎన్నికల ప్రచారంగా మార్చి  ప్రజలకు ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఇంద్రవెల్లి సభలో రైతులకు ప్రీమియం కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టుకుంటుందని చెప్పి నేడు చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. రైతులకు ఎదురైన ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాల్సిన స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ.. ఇద్దరు సైతం ప్రశ్నించకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన ప్రీమియం కట్టెంత వరకు రైతుల పక్షుల పోరాడుతామన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  రైతులకు రూ.10 వేలు నష్టపరిహారాన్ని అందిస్తే  సరిపోదు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా 25 వేల పంట నష్టపరిహారాన్ని ఎందుకు ఇవ్వలేకపోతున్నారని. జోగు రామన్న ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గండ్రత్ రమేష్, సేవ్వా జగదీష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహాలాద్, కుమ్ర రాజు, బట్టు సత్తిష్, కనక రమణ, ఫిరంగి మల్లేష్, మేస్రం పరమేశ్వర్, ఆప్కమ్ గంగయ్య, ఆత్రం వెంకటేష్, సీడం లక్ష్మణ్, కొత్తపల్లి సంతోష్, కుమ్ర రాము, రామ్ చందర్, కుమ్ర జంగుబాపు, కుమ్ర మోతిరామ్, గెడం రాము, ఉగ్గే విట్టల్, తదితరులు పాల్గొన్నారు.