Kumuram Bheem Asifabad Latest News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గత 5 రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష విరమించారు. బిజెపి శాసనసభక్ష నేత మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, రాకేష్ రెడ్డి, పాయల శంకర్ నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ప్రజల కోసం ఎమ్మెల్యే బతకాల్సి ఉందని, మున్ముందు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని జీవో 49 రద్దు సాధించుకుంటామని అన్నారు. పోడు రైతులు, 3 లక్షల 75 వేలమంది రైతులకు న్యాయం జరిగే విధంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. అసెంబ్లీలో బయట కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ఎమ్మెల్యేను దీక్ష విరమించాలని కోరారు. అలాగే నాయకులు కార్యకర్తలు సైతం ఎమ్మెల్యే దీక్ష విరమణకు ఒప్పుకోవడంతో ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు దీక్ష విరమించారు. అనంతరం నిరసనగా బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. బిజెపి నేతలు కాగజ్ నగర్ పట్టణంలో బంద్ చేపట్టారు.
Kumuram Bheem Asifabad Latest News:సిర్పూర్ ఎమ్మెల్యే దీక్ష విరమణ- నిమ్మరసం తాగించి విరమించిన బీజేపీ ఎమ్మెల్యేలు
Shailender | 23 Aug 2025 12:05 AM (IST)
Kumuram Bheem Asifabad:కాగజ్‌నగర్‌లో దీక్ష చేస్తున్న సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్‌తో బీజేపీ నేతలు దీక్ష విరమించారు. ప్రజల తరఫున పోరాటాలు చేయడానికి ఎమ్మెల్యే బతకాలని, అసెంబ్లీ కొట్లాడాలని నేతలు సూచించారు.
సిర్పూర్ ఎమ్మెల్యే దీక్ష విరమణ- నిమ్మరసం తాగించి విరమించిన బీజేపీ ఎమ్మెల్యేలు