Fake Detergent Smuggling to Adilabad | ఆదిలాబాద్: మహారాష్ట్ర నుంచి నకిలీ డిటర్జెంట్ పౌడర్ ను ఆదిలాబాద్ జిల్లాకు తరలిస్తున్న కేసులో ఆదిలాబాద్ టూటౌన్ పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. నకిలీ ఘడీ బ్రాండ్ డిటర్జెంట్ పౌడర్ ను తరలిస్తున్న వాహనాన్ని జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు, ఎస్ఐ విష్ణు ప్రకాష్ తో కలిసి ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. 

బస్టాండ్ వద్ద పట్టుకున్న పోలీసులు

రూ.లక్ష విలువైన 15 క్వింటాళ్ల డిటర్జెంట్ పౌడర్ ను మహారాష్ట్ర అమరావతి నుంచి ఆదిలాబాద్ కు చెందిన రూపేష్ అగర్వాల్ కు విక్రయించే క్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని తాంసీ బస్టాండు వద్ద పోలీసులు పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో A3, రూపేష్ అగర్వాల్ తో పాటు మహారాష్ట్ర, చంద్రాపూర్ కు చెందిన ఇద్దరు A1, శివాజీ ఎన్. జవాలె, ఆ,రామారావు వన్కంటి ఇంగాలె, లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు మహారాష్ట్ర, అమరావతికి చెందిన A4, అప్సక్ సలత్ కోసం గాలిస్తున్నామన్నారు. జిల్లాలో నకిలీ ఉత్పత్తులను తరలించి విక్రయించే వారి సమాచారం తెలిస్తే పోలిసులకు సమాచారం ఇవ్వాలని వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.  

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సామాగ్రి పట్ల అప్రమత్తంగా ఉండాలిఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున నకిలీ సామగ్రి జిల్లాలోకి వస్తోందని, అలాంటి వస్తువులపై వ్యాపారులు, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఆదిలాబాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేషన్ అధ్యక్షుడు దినేశ్ మటోలియా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. సామగ్రిని చాలా చౌకగా విక్రయిస్తుంటే అనుమానపడాలని, ఈ విషయమై ఉన్నతాధికారులను లేదా చాంబర్ ఆఫ్ కామర్స్ వారిని సంప్రదించాలని కోరారు, కొనుగోలు చేసిన వస్తువులకు తప్పనిసరి రశీదు తీసుకోవాలని సూచించారు. వారితో ప్రధాన కార్యదర్శి కందుల రవీందర్, సభ్యులు తానాజీరావు నిక్కం, చిట్కేషి నాగేశ్ తదితరులు ఉన్నారు.