కేంద్రం ప్రకటించిన వార్షిక బడ్జెట్ అన్ని వర్గాల వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఈ ఏడాదే కాకుండా వచ్చే 25 ఏళ్ల అభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు. కోవిడ్ కారణంగా గతేడాది అర్ధికాబివృద్ధిలో దేశం కొంత వెనుకబడినా ఈ ఏడాది తిరిగి పుంజుకుంటుందన్నారు ఎంపీ అరవింద్. ముఖ్యంగా రైతుల కోసం రసాయనరహిత, సేంద్రీయ సాగును ప్రోత్సహించనుంది కేంద్రం. 2023ను చిరుధాన్యాల సంవంత్సరంగా గుర్తించి వాటి మార్కెటింగ్, బ్రాండింగ్ కు తగిన సహకారం అందించనుంది. రైతుల వ్యవసాయక్షేత్రాలలో ఉపయోగించుకునేందుకు వీలుగా కిసాన్ డ్రోన్లను అభివృద్ది చేయడం జరిగిందన్నారు ఎంపీ అరవింద్. వ్యవసాయ పనిముట్లను రైతులకు అద్దె ప్రాతిపాదికన అందించేందుకు తెచ్చిన పథకాన్ని స్వాగతిస్తున్నానన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎంఎస్ పి కింద కొనుగోలు చేసిన గోదుమ, వరికి రూ. 2.37 లక్షల కోట్లు రైతుల ఖాతాలో వేశామన్నారు అరవింద్.
ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా రాబోయే రోజుల్లో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుందన్నారు. కొత్తగా 400 వందే భారత్ రైళ్లను కూడా తీసుకురానుంది కేంద్రం. అలాగే దేశంలో పర్యాటనకు, రవాణాకు ఎంతో దోహదపడే పిఎం గతి శక్తి ద్వారా మరో 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల విస్తరణ జరగనుందని అన్నారు ఎంపీ అరవింద్. చిన్న మధ్యతరగతి పరిశ్రమల కోసం క్రెటిడ్ గ్యారంటీ స్కీమ్ కోసం 2 లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. కరోనా తో విద్యార్ధులు చదువుకు దూరం కాకూడదని డిజిటల్ యూనివర్సటీ స్థాపించడం జరుగుతుంది. ఇప్పటి వరకూ ఉన్న 12 టీవీ ఛానల్స్ ని 200 కి పెంచి పిల్లలకు డిజిటల్ విద్యను అందించనుందని తెలిపారు.
పట్టణాల్లో పర్యావరణ పరిరక్షనకు విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహం. అందులో భాగంగా బ్యాటరీల అభివృద్దికి ప్రోత్సహకాలు అందించండం జరుగుతుంది. పోస్టాఫీసులను కోర్ బ్యాంకింగ్ లోకి తీసుకురావడం జరుగుతుంది. డిజిటల్ బ్యాంకింగ్ ను ప్రోత్సహించడానికి 5 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఎంపీ అరవింద్. ఇలా ఈ బడ్జెట్ అన్ని రంగాలు అన్ని వర్గాల అభివృద్దికి దోహదపడేలా ఉంది. వ్యవసాయం నుంచి రక్షణ రంగం వరకూ పారిశ్రామికే వేత్తల నుంచి స్త్రీల స్వయం సహయక బృందాలు, నిరుపేద వర్గాల వరకూ అందరిని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ తయారు చేయడం జరిగిందన్నారు ఎంపీ అరవింద్.
హర్ ఘర్ జల్ పథకం కింద గత రెండేళ్లలో ఐదున్నర కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇవ్వడం జరిగింది . ఈ ఏడాది మరో 3.8 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్ కల్పించడం కోసం బడ్జెట్ లో రూ.60 వేల కోట్ల నిధులు కేటాయించడం జరిగిందన్నారు ఎంపీ అరవింద్. కేంద్రం రెండేళ్లలో 5.5 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇచ్చింది. 60 వేల కోట్లతో ఈ ఏడాది మరో 3.8 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్ ఇవ్వనుంది. కేసీఆర్ మాత్రం గత ఏడున్నర ఏళ్లలో 45వేల కోట్లు ఖర్చుపెట్టినా.. కోటి ఇండ్లు కూడా లేని తెలంగాణలో మిషన్ భగీరథ పథకం ఇంకా అతా పతాలేదని. ఇదొక్క ఉదాహరణ చాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, నిర్లక్ష్య పాలన గురించి చెప్పడానికి అని అన్నారు ఎంపీ అరవింద్.