కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఎప్పటికీ రాణించలేరని అభిప్రాయపడ్డారు నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో జరిపిన చిట్ చాట్‌లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ కేవలం పేరు మార్పు కోసమే అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం రోజున కేటీఆర్‌ను పిలిచిన కేసీఆర్.. ఎమ్మెల్సీ కవితను ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు ఎంపీ అరవింద్. ఇందూరుకు సంబందించిన రాజకీయ నాయకురాలిని పిలవలేదన్నారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావ్ కూడా లేరు అని గుర్తు చేశారు. ఎందుకు పిలవలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కవితను బీఆర్‌ఎస్‌లో యాక్టివ్‌గా ఉంచాలని నిజామాబాద్ జిల్లా వాసిగా తన కోరికగా వివరించారు.  దసరా నాడు చెడు మీద మంచి విజయం అని ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కవిత ఆ రోజు నుంచి గాయబ్  అయ్యారని ఆరోపించారు ఎంపీ అరవింద్.

 

బీఆర్‌ఎస్‌లో భారత మ్యాప్ వేసి పాక్ ఆక్రమిత కాశ్మీరును లేపేశారని ఆరోపించారు ఎంపీ అరవింద్. బీఆర్ఎస్ పార్టీ రిజిస్టర్ కాలేదని... కేసీఆర్ బతికున్నంత వరకు నేషనల్ పార్టీ కాదని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు పట్టించుకోకుండా... బీఆర్ఎస్ పార్టీ పెట్టారని అన్నారు అరవింద్. లిక్కర్ స్కాంలో ఓ మహిళా నేత కూడా ఉన్నారని  వార్తల్లో చూశామని వివరించారు. త్వరలోనే అ మహిళా నేతను కూడా అరెస్టు చేస్తారని అన్నారు.

 

ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంలో ఉన్నారని ఆరోపణలేనా లేక ఆధారలున్నాయా అని ఏబీపీ దేశం అడిగిన ప్రశ్నకు ఆధారాలుంటేనే కదా అరెస్టులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు ఎంపీ అరవింద్. అభిషేక్ రావు వాగ్మూలం మేరకు మరి కొంత మందికి నోటీసులు జారీ అవుతున్నాయని అన్నారు.
 


నిజామాబాద్ జిల్లా టెర్రరిస్టులకు అడ్డా 

 

నిజామాబాద్ జిల్లా టెర్రరిస్టులకు అడ్డాగా మారిందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ సభ్యుల అరెస్టులు కొనసాగుతున్నాయని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో టెర్రరిస్ట్ కార్యకలాపాలకు అడ్డాగా మారిందని పార్లమెంట్‌లో సైతం తన గళం వినిపించాని వీడియో పుటేజీని మీడియా ముఖంగా చూపించారు అరవింద్. పీఎఫ్ఐ వ్యవహారంలో టీఆర్ఎస్, ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉన్నారని ఆరోపించారు అరవింద్. ఎన్‌ఐఏ ద్వారా దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే అమిత్ షాకు, డిజిపి మహేందర్ రెడ్డి కి ఫిర్యాదు చేశానని చెప్పారు ఎంపీ అరవింద్. పీఎఫ్ఐకి సంబంధించి దేశవ్యాప్తంగా అరెస్టులు జరిగాయన్నారు. ఏడాదిన్నర క్రితం బోధన్ లో దొంగ పాస్ పోర్ట్ ల జారీ వ్యవహారం బయటపడిందన్నారు. ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ పీఎఫ్ఐ రెక్కీ నిర్వహించింది మరి కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతోందని అడిగిన ప్రశ్నకు ఆ వ్యవహారం కేంద్ర చూసుకుంటుందని అన్నారు అరవింద్. 

 

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లరు 

 


ముందస్తు ఎన్నికలు వస్తాయని అనుకోవడం లేదన్నారు ఎంపీ అరవింద్. కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్లే అవకాశం లేదన్నారు ఎంపీ. మునుగోడులో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు ఉందన్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. బీజేపీదే గెలుపు ఖాయం అన్నారు ఎంపీ అరవింద్. మునుగోడులో బీజేపీ గెలిచాక అభివృద్ధి చేస్తామన్నారు. ఒక్క మునుగోడు కాదు తెలంగాణ మొత్తం అభివృద్ధి చేస్తామన్నారు అరవింద్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన అరవింద్ రాజగోపాల్ రెడ్డి 20 ఏళ్ల క్రితమే కాంట్రాక్టర్ అని అన్నారు ఎంపీ అరవింద్. 

 

కేసిఆర్ కు సొంత విమానం ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు అరవింద్. బ్యూటీ పార్లర్ తో కవితకు కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒకటే అన్న అరవింద్... రేవంత్ రెడ్డి కూడా మునుగోడు ఎన్నికల ప్రచారంలో గులాబీ కండువా కప్పుకుని స్పీచ్ ఇచ్చారని అన్నారు.   

       


 పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో జోడోయాత్ర చేయమనండి .

 

ఏఐసీసీ అధ్యక్ష పోటీలో ఉన్న వ్యక్తి రాహూల్ కంటే 25 ఏళ్లు పెద్దవాడై ఉండాలని... 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడవద్దు... స్మార్ట్ గా ఉండోద్దు.. హింది సరిగ్గా రావొద్దు అన్న కండిషన్స్ ఉన్నాయంటూ ఎంపీ అరవింద్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పాక్ అక్రమిత కాశ్మీర్ లో పాదయాత్ర చేయమని సవాల్ చేశారు. అప్పుడే తాము భారత్ జోడో యాత్ర అని ఒప్పుకుంటామని అన్నారు. అసలు భారత్ ఏం విడిపోయిందని జోడో యాత్ర చేపట్టారు అని అన్నారు. 

 

కేంద్రం పాలసీతో పసుపు రైతులు హ్యాపీ 



 

పసుపు రైతులు కేంద్ర సర్కార్ చర్యల వల్ల హ్యాపీగా ఉన్నారని అన్నారు ఎంపీ అరవింద్. ముందు ముందు పసుపు రైతులకు మరిన్ని మంచిరోజులు వస్తాయని అన్నారు.. పసుపు పంట సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించిన రైతులు బిజెపిలో చేరుతున్నారని..... ఇప్పటికే కొందరు రైతులు బీజేపీలో చేరారని చెప్పారు అరవింద్. ఇది బిజెపి నైతిక రాజకీయ విజయం అని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్లే పసుపు రైతులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. పసుపు పంటను వేర్ హౌస్ లో నిల్వ చేసి క్వింటాకు రూ. 10వేల ధర వచ్చిందని చెప్పారు అరవింద్. పసుపు శుద్ధి కర్మాగారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాధనలు కేంద్రానికి పంపితే తాము 80 శాతం సబ్సిడీ ఇస్తామని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపమన్నా పట్టించుకోవటం లేదని అన్నారు ఎంపీ అరవింద్. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల మహారాష్ట్రలో పసుపు పంట విస్తీర్ణం పెరిగిందన్నారు. అక్కడ కూలీ రేట్లు తక్కువ. ఎకరానికి 60 నుంచి 70 వేల రూపాయలు కూలీలకు ఖర్చైతే ఇక్కడ లక్ష నుంచి 1.20వేల రూపాయలు ఖర్చవుతున్నాయని అన్నారు ఎంపీ అరవింద్.

 

తెలంగాణ లో 17 ఇధనాల్ ఫ్యాక్టరీలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదని అన్నారు అరవింద్. డబ్బులు ఇస్తాం, ప్రతిపాదనలు పంపాలని కోరుతున్న రాష్ట్ర సర్కార్ పట్టించుకోవడం లేదని అన్నారు ఎంపీ. వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తా అని చెప్పుకొచ్చారు ఎంపీ అరవింద్.