Nizamabad News : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. పరీక్షలు సరిగ్గా రాయలేదని విద్యార్థుల వీపులు వాచిపోయేలా విచక్షణ రహితంగా చితకబాదాడు ఉపాధ్యాయుడు. మాస్టారు కొట్టిన దెబ్బలకు ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులను టీచర్లు కొట్టడం మామూలే కానీ మరీ ఇంత తీవ్రంగా కొట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


పరీక్షలు సరిగ్గా రాయలేదని 


ఎడపల్లి మండలం జానకంపేట్ ప్రభుత్వ పాఠశాలలోని అనిల్ కుమార్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులను తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు చేసే చిన్న చిన్న  తప్పులకు ఇంత తీవ్రంగా కొడతారని ప్రశ్నిస్తున్నారు. పరీక్షలు సరిగా రాయలేదని విద్యార్థుల వీపులు వాచిపోయేలా విచక్షణారహితంగా టీచర్ కొట్టాడు. 8వ తరగతి చదువుతున్న విగ్నేష్ కుమార్, వరుణ్ లతో సహా మరో ముగ్గురు విద్యార్థులను అనిల్ కుమార్ అనే ఉపాధ్యాయుడు మార్కులు తక్కువ వచ్చాయని కొట్టాడు. సరిగ్గా చదవకపోతే చీరేస్తా, చెప్పుతో కొడతా అంటూ విద్యార్థులపై దుర్భాషలాడాడు. అంతేకాకుండా విద్యార్థులకు ఒళ్లంతా గాయాలు కనిపించేలా కొట్టాడు. ఆ దెబ్బలను  తట్టుకోలేక విద్యార్థులు ఏడుస్తూ తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థులకు మంచి బుద్ధి చెప్పాల్సిన ఉపాధ్యాయులు విద్యార్థులను ఇంతలా కొట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఉపాధ్యాయుడు అనిల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 


ట్యూషన్ టీచర్ పైశాచికత్వం 


కొందరు ఉపాధ్యాయులు పైశాచికంగా మారుతున్నారు. విద్యార్థులకు సరైన చదువులు చెప్పాల్సిన వారే దిగజారీ ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులను శారీరకంగా వేధిస్తున్నారు. ప్రైవేట్ క్లాసులని, యువతులను వేధింపులకు గురిచేస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు. ఇలాంటి ఘటనే గుజరాత్ లో జరిగింది. వడోదరలోని నిజాంపూర ప్రాంతంలో ప్రశాంత్ ఖోస్లాలో ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్ ఖోస్లా అనే వ్యక్తి విద్యార్థులకు ట్యూషన్ నడిపిస్తున్నాడు. అతని వద్ద పదుల సంఖ్యలో విద్యార్థులు ట్యూషన్ కు వస్తుంటారు. అతడు గత బుధవారం ట్యూషన్ కోసం వచ్చిన బాలికను ఇంటి లోపలికి తీసుకెళ్లి మద్యం తాగాలంటూ వేధించాడు.  


మద్యం తాగించి 


విద్యార్థిని ఒప్పుకొక పోవడంతో చిన్నారిని బలవంతం చేసి మద్యం తాగించాడు. బాలిక అపస్మారక స్థితికి వెళ్లిన తర్వాత బాలిక ఇంటిదగ్గర వదిలేసివచ్చాడు. వెంటనే తల్లిదండ్రులు బాలికను ప్రైవేట్  ఆస్పత్రికి తీసుకెళ్లగా ట్యూషన్ టీచర్ పైశాచికత్వం బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులు ట్యూషన్ టీచర్ పై పోలీసులకు  ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ట్యూషన్ టీచర్ ను పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు.