నిజామాబాద్‌లో వచ్చే నెల 4 నుంచి 9 వరకు సీహెచ్ కొండూరులో జరగనున్న లోహమయ శిలామయ విగ్రహ ప్రతిష్టాపనకు అందర్నీ ఆహ్వానించారు ఎమ్మెల్సీ కవిత. ఆలయ పునః ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను ముందుగా నీలకంఠేశ్వరాలయ స్వామివారికి అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తమ ఇంటి ఇలవేల్పు అయిన సిహెచ్ కొండూరులో కొలువై ఉన్న  శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పున ప్రారంభ కార్యక్రమాలు వివరాలు తెలిపారు. 


నిజామాబాద్ జిల్లాలో ఏకార్యం చేపట్టిన మొదట నీలకంఠేశ్వర ఆలయం స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు కవిత. అందుకే స్వామి వారికి ఆహ్వాన పత్రికను సమర్పించామని తెలిపారు. నీలకంటేశ్వర ఆలయం నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారామె. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కావలసిన నిధులు మంజూరు చేస్తుందన్నారు. నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనులు కోసం ఎమ్మెల్యే గణేష్ గుప్తా నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందన్నారు. 






ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జెడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్ దండు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.