MLA Rekha Nayak: బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఖానాపూర్ మండలంలోని తర్లపాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఆమె మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్త తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను.. ఇంటింటికి తీసుకో వెళ్లి ప్రతీ ఒక్కరికీ వివరించాలని సూచించారు. అలాగే ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని అన్నారు.
దేశంలోని పలు రాష్ట్రాలు.. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని.. పార్టీ శ్రేణులంతా ఐకమత్యంతో పార్టీ కోసం పని చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రం సంక్షేమ పథకాలకు నిలయంగా మారిందని ఎమ్మెల్యే రేఖా నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మరియు గ్రామ ప్రజా ప్రతినిధులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్‌లో రోజంతా BRS నేతల వరుస ప్రెస్ మీట్లు
బీఆర్‌ఎస్ నేతలు వరుసబెట్టి బీజేపీకి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా నేతలంతా విరుచుకుపడ్డారు. తెలంగాణ భవన్‌లో రోజంతా గులాబీ నేతల హడావిడి కనిపించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒకరితర్వాత ఒకరు వచ్చి ప్రెస్‌మీట్లు పెట్టి బీజేపీ మీద ఫైరయ్యారు. సీఎం కేసీఆర్ మోదీ టూర్‌కు దూరంగా ఉంటారని కూడా క్లారిటీ ఇచ్చారు. సింగరేణి సమ్మె మోత మోగుతుందని అన్నారు. కోల్ బెల్ట్ ఏరియాల్లో బీజేపీ నేతలను తిరగనివ్వబోమని BRS నేతలు తేల్చిచెప్పారు.
ప్రధాని సభకు కేసీఆర్ రావడం లేదు- వినోద్ కుమార్
ప్రధాని మోదీ తెలంగాణను గందరగోళ పరచాలని చూస్తున్నారన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘ వైస్ చెర్మన్ వినోద్ కుమార్. అభివృద్ధిలో తెలంగాణకు వీసమెత్తు సాయం చేయడం లేదన్నారు. జాతీయ రహదారుల విషయంలో నితిన్ గడ్కరీ దగ్గరికి పోతే నేనేం చెయ్యాలి అని అన్నారని తెలిపారు. ఇప్పుడు ఉన్నది మునుపటి బీజేపీ పార్టీ కాదు. ప్రధాని తెలంగాణకు జాతీయ రహదారులు ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నవోదయ విద్యాలయాలు కొత్త జిల్లాలకు ఇవ్వాలనే హామీ ఎక్కడ పోయిందని ప్రశ్నించారు? తెలంగాణ ప్రజలకు చట్టబద్దంగా రావాల్సినవి రావడం లేదని.. మోదీ మేం అడిగిన వాటికి సమాధానం చెప్పాలన్నారు. రేపు ప్రధాని సభకు సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు.. ఆయన ఒక్కరే వచ్చి పోతారని క్లారిటీ ఇచ్చారు వినోద్ కుమార్.
బండి సంజయ్ విచిత్రంగా మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. సంజయ్ విద్యార్థులు జీవితాలతో రాజకీయాలు చేస్తున్నారని... రెండు పేపర్లు లీక్ కావడానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. ఎన్ని పాపాలైనా చేయాలి పవర్‌లోకి రావాలి అనేది బీజేపీ విధానమన్నారు. అసలు ఉద్యమంలో నువ్వు ఎక్కడ ఉన్నావ్ అని బండిని ప్రశ్నించారు. పొరపాటును ఇప్పటికైనా ఒప్పుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీ అంటే బ్రోకర్. జే అంటే జుమ్లా. పీ అంటే పేపర్ లీకేజ్ పాలిటిక్స్ అన్నారు. బండి మీద యాక్షన్ తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా ఇందులో సంబంధం ఉన్నట్లే అన్నారు మంత్రి ఎర్రబెల్లి