నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని శ్రేణులకు సూచించారు. నగరంలోని ఓల్డ్ కలెక్టరేట్ వద్ద కళా భారతి భావన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ సందర్భంలో వచ్చినా అన్ని పరీక్షలకు నిజామాబాద్ నుంచే తిరుగులేని సమాధానం ఇవ్వాలని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు మంత్రి కేటీఆర్. తప్పకుండా నిజామాబాద్ పార్లమెంట్ తో సహా జిల్లాలోని అన్ని శాసనసభ స్థానాలు కూడా గెలుచుకునే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కార్యోన్ముఖులు కావాలన్నారు. రాబోయే ఏడు నుంచి తొమ్మిది నెలపాటు నిర్విరామంగా.... అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతోపాటు ప్రజాహితమైన కార్యక్రమాల్లో అందరూ పనిచేయాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్.
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నిజామాబాద్ జిల్లాకు ఒక చక్కటి అపురూపమైన కానుక అందించాలని ఉద్దేశంతో రూ. 50 కోట్లతో ఒక అత్యుత్తమమైన కళాభారతి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయటం సంతోషంగా ఉందన్నారు. తనకు తెలిసి తెలంగాణ మొత్తంలో ఎక్కడా లేనంత గొప్పగా ఇందూరు కళాభారతిని శంకుస్థాపన చేసుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు కేటీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా తనను, ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్‌ని పిలిచి సమీక్ష నిర్వహించడం జరిగిందని గుర్తుచేశారు.
నిజామాబాద్ కార్పొరేషన్ లో ఏం అవసరం ఉంది. ఇంకా ఏం చేయాలి అని అడిగారన్నారు. ఎందుకు అని అడిగితే తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్‌తో మొట్ట మొదట నడిచింది నిజామాబాద్ జిల్లా అని అన్నారు. ఆనాడు గులాబీ జెండా ఎత్తి మొత్తం తెలంగాణకు దిశ నిర్దేశం చేసింది నిజామాబాద్ జిల్లా అందుకే ఇక్కడ ఎంత చేసినా తక్కువనే అని కేసీఆర్ 936 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి కార్యక్రమాల రూపంలో మంజూరు చేశారని తెలిపారు కేటీఆర్. నిజామాబాద్ పట్టణ రూపురేఖలు మార్చే విధంగా ప్రజలకు సంతృప్తినిచ్చే విధంగా కార్యక్రమం చేయండి ఎక్కడ అవసరం ఉంటే అక్కడే విధులు ఖర్చుపెట్టి చక్కగా చేయండని అన్నారు కేటీఆర్.
రైతు జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు సీఎం కేసీఆర్....
నిజామాబాద్ రైతులతో ముఖముఖిలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని భూమా కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రైతుల జీవితాల్లో కేసీఆర్ ప్రభుత్వం వెలుగు నింపుతొందన్నారు కేటీఆర్. కరోనా లాంటి కష్ట సమయంలో అందరూ తల్లడిల్లుతుంటే రైతులకు ఇబ్బంది కాకుండా ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేసామన్నారు.
రాష్ట్రంలో 6 వేల రైతు వేదికలు ఏర్పాటు చేశాo. 5000 మందికి ఒక క్లస్టర్ ను ఏర్పాటు చేశామన్నారు. రైతు వేడుకలు అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. రైతులకు సాగు నీటి అవసరాల కోసం 60 వేల చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించామని తెలిపారు కేటీఆర్. రాష్ట్రం లో భూగర్భ జలాలు పెంపొందించాం. ఎస్సారెస్పీ లాంటి ప్రాజెక్ట్ లకు పునరుజ్జివనం పోశాo. భారత దేశంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ను తక్కువ సమయంలో నిర్మించామన్నారు కేటీఆర్. పారిశ్రామిక అవసరాలకు 2050 వరకు జనాభా ఎంత పెరిగినా తాగునీటి సౌకర్యం ఉందన్నారు. 24 గంటల కరెంట్, ప్రాజెక్ట్ ల వల్ల తెలంగాణలో యాసంగిలో మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం వచ్చిందన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంట్ ఇవ్వటం వల్ల రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. తెలంగాణలో ప్రాజెక్ట్ ల నిర్మాణం వల్ల రెండవ నీటి విప్లవం ప్రారంభమైందన్నారు కేటీఆర్.
ఆంధ్రలో చేపలు పెంచే విధంగా తెలంగాణలోనూ చెరువుల్లో చేపలు పెంచవచ్చు. నీటి వనరులు సంవృద్దిగా ఏర్పరుచుకున్నామని తెలిపారు కేసీఆర్. తెలంగాణ ఏర్పడిన నాడు వ్యవసాయ ఉత్పత్తులో 27 వ స్థానంలో ఉన్న రాష్ట్రం నేడు మూడో స్థానానికి చేరుకుందన్నారు. ఇది కెసిఆర్ నాయకత్వంలో రైతుల కోసం చేపడుతున్న సంక్షేమ పథకాల వల్లే సాధ్యమైందన్నారు కేటీఆర్. తెలంగాణలో నీలి విప్లవం ప్రారంభమైంది. దేశంలోనే చేపల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గాని నిలుస్తుందని అన్నారు. శ్వేత విప్లవానికి కూడా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఒకప్పుడు నష్టాల్లో ఉన్న విజయ డైరీ ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల లాభాల్లోకి వచ్చింది..పాడిపంట రెండు కలిస్తేనే రైతుకు ఆదాయం ఆ దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు కేటీఆర్.
దళిత బంధు ద్వారా అణగారిన వర్గాల ప్రజల జీవితాలు వెలుగులు నింపుతున్నాం.. ఇతర రాజకీయ నేతల అబద్ధపు హామీలు ఇవ్వటo తమకు తెలియదన్నారు. పసుపు బోర్డు విషయంలో రైతులను ఇతర నాయకులు మోసం చేశారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ పంట సాగు అయ్యేవిధంగా రైతులను ప్రోత్సహించాం.. తద్వారా రైతుకు అధిక లాభాలు వచ్చి చేరుతాయి. హరిత విప్లవం నీలి విప్లవం గులాబీ విప్లవం పసుపు విప్లవం శ్వేత విప్లవం ఈ ఐదు విప్లవాల ద్వారా రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం..దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రైతు సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం పాటుపడుతోందన్నారు.