నేటి నుంచి జీ 20 సన్నాహక సమావేశాలు


నేటి నుంచి హైదరాబాదులో జి20 సన్నాహక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉదయం 8.45 గంటలకు ఓ హోటల్‌లో జరిగే Startup20 Engagement Group సమావేశంలో పాల్గొంటారు. ఇండియా అధ్యక్షతన ఈసారి జీ20 సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్‌లో జరిగే సదస్సు కోసం దేశవ్యాప్తంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ సమావేశాలు ఫిబ్రవరి వరకు జరుగుతాయి. బెంగళూరు, ఛండీగఢ్‌, చెన్నై, గౌహతీ, ఇండోర్, జోద్‌పూర్, ఖజరహా, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణె, రాణ్‌ఆఫ్‌ కచ్‌, సూరత్, తిరువనంత పురం, ఉదయ్‌పూర్, హైదరాబాద్‌, విశాఖలో వరుసుగా సదస్సులు ఉంటాయి.


ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యం భయాలను చూస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతోంది. ఐరోపా, రష్యా మధ్య విభేదాలు తొలగిపోవడం లేదు. ఇలాంటి టైమ్‌లో భారత్‌ ఈ సదస్సు నిర్వహించాల్సి వస్తుండటం ప్రత్యేకంగా మారింది.


నేడు వరంగల్ కు చిరంజీవి, రవితేజ... 


హ‌న్మ‌కొండ ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో నేడు సాయంత్రం వాల్తేరు వీరయ్య విజ‌యోత్స‌వ స‌భ జరగనుంది. దీని కోసం నిర్వాహ‌కులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో మెగాస్టార్ చిరంజీవి, ర‌వితేజ‌, హీరోయిన్ శృతిహాస‌న్‌తోపాటు యూనిట్ స‌భ్యులు పాల్గొంటార‌ని నిర్వాహ‌కులు పేర్కొన్నారు. చిరు రాక కోసం మెగా ఫ్యాన్స్ ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు.


నేడు నిజామాబాద్ మంత్రి కేటీఆర్ పర్యటన


మంత్రి కేటీఆర్ నేడు నిజామాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉదయం 9 గంటలకు నిజామాబాద్ చేరుకోనున్నారు మంత్రి. కాకతీయ సాండ్ బాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు మంత్రి కేటీఆర్. అనంతరం ఉదయం 11 గంటలకు రైల్వే అండ్ బ్రిడ్జి ప్రారంభించడంతోపాటు కళాభారతికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మంత్రి రాక సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పాత కలెక్టరేట్ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న కళాభారతికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే రైల్వే కమాన్ వద్ద నూతనంగా నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించడంతోపాటు కలెక్టరేట్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.