Indrakaran Reddy: భారీగా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఈ ప్రాజెక్టుకు 18 గేట్లు ఉన్నప్పటికీ నాలుగు గేట్లు పని చేయడం లేదు. దీంతో 14 గేట్లు మాత్రమే ఎత్తి దిగువకు నీటిని వదిలి పెడుతున్నారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో గేట్ల పైభాగం నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు కడెం వాసులను ఖాళీ చేయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు. 


కడెం ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి


నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ను గురువారం ఉదయం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్, నిర్మల్ జిల్లా కలెక్టర్ కే వరుణ్ రెడ్డి నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ తో కలిసి రాష్ట్ర న్యాయ ఆటవి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కడెం ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం కడెం జలాశయంలో వస్తున్న ఇన్ ఫ్లో వరద నీరు వరద గేట్ల పరిస్థితి పై నీటిపారుదల శాఖ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. కడెం ప్రాజెక్టు గేట్ల పై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు కారణంగా లోతట్టు గ్రామాల ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు. ప్రాజెక్టుకు వరద ముప్పు ఏర్పడితే తీసుకోవాల్సిన చర్యలపై పలు శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.






ఈ సందర్భంగా కడం ప్రాజెక్టుపై రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు చెందిన నాలుగు వరద గేట్లు మోరయించిన సందర్భంగా ప్రస్తుతం ప్రాజెక్టు చెందిన 14 వరద గేట్ల ద్వారా రెండు లక్షల 40 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేయడం జరిగందన్నారు. కడెం ప్రాజెక్టు జలాశయంలో ప్రస్తుతం ఇన్ ఫ్లో నీరు తగ్గు ముఖం పడుతుందని, ప్రాజెక్టుకు ఎలాంటి వరద ప్రమాదం ఉండబోదని తెలిపారు. ఈ సంద్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రెండు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ప్రజలు భయాందోళన చెందకుండా ఉండాలని.. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటామని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతo కడెం ప్రాజెక్టు లెవెల్ 772.100/100 ఫిట్లు ఉండగా దీనికి 8.177/7.60 టీఎంసీలు  ఉందన్నారు. అయితే భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఇన్ ఫ్లో 21,9058 క్యూసెక్కులు కాగా.. 14 గేట్లను ఎత్తివేసి 23,4775 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే దిగువన ఉన్న 12 గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు రెండు రోజుల పాటు పరిస్థితిని అంచనా వేస్తూ... ప్రజలకు అందుబాటులో ఉంటారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడిచారు. మంత్రి వెంట కడెం ప్రాజెక్టు ఈ.ఈ రాథోడ్ విఠల్, డి.ఈ. బోజదాసు, నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, కడెం మండల తహశీల్దార్ చిన్నయ్య, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఖానాపూర్ సీఐ రవీందర్ నాయక్, కడెం ఎస్సై కే. రాజు స్థానిక ప్రజాప్రతినితులు తదితరులు ఉన్నారు.


అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కడెం ముంపు బాధితులను పరామర్శిచేందుకు వెళ్లారు. ఈక్రమంలోనే ముంపు బాధితులు మంత్రిపై కడెం వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది వచ్చిన వరదలకే కడెం ప్రాజెక్టు గేట్లు పాడయ్యాయని.. ఇన్ని రోజులు వాటిని ఎందుకు బాగు చేయించలేదని మంత్రిని నిలదీశారు. మంత్రితో పాటు అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే రేఖా నాయక్‌ను కూడా ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో కూడా వసతులు సరిగా లేవని కడెం వాసులు మండిపడ్డారు. భోజనం కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు.  ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి ఉంటే తాము ఇలా వరదల్లో చిక్కుకోవాల్సిన దుస్థితి వచ్చేది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.