వరి కొనడానికి కేంద్రం కొర్రీలు పెడుతోందని టీఆర్‌ఎస్‌ గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తోంది. దిల్లీలో కేంద్ర మంత్రులతో పలుమార్లు భేటీల్లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. కానీ ప్రయోజనం లేకపోయేసరికి ప్రజల్లోనే తేల్చుకుంటామని చెప్తున్నారు. అందులో భాగంగా సోమవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. 


టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఇచ్చిన పిలుపుమేరకు ఆ పార్టీ శ్రేణులు ధర్నాలు చేపట్టారు. కేంద్రప్రభుత్వం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చావు డప్పు పేరుతో నిరసనలు చేపట్టాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఆందోళనలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  


కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ భాస్కర్ రెడ్డి  రైతులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సదరు నేత రైతులపై కేంద్రం తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మోదీపై విమర్శలు చేయబోయారు. కాని అక్కడే ఫ్లోలో దొర్లిన తప్పు ఇప్పుడు వైరల్‌గా మారింది. మోదీ మెడలు వంచితేనే రైతులకు న్యాయం జరుగుతుంది అనబోయి సీఎం కేసీఆర్ మెడలు వంచైనా రైతులకు న్యాయం జరిగే వరకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అంటూ స్పీచ్ దంచేశారు.


ఈ స్పీచ్ విన్న అక్కడి టీఆర్‌ఎస్ నాయకులు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. ఆ వెంటనే తేరుకున్నారు భాస్కర్ రెడ్డి. ఈ యువనేత సాక్షాత్తు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చిన్న కొడుకు కావడంతో ఈ  వీడియోను ప్రత్యర్థులు తెగ షేర్‌ చేస్తున్నారు. 



Also Read: Piyush Goyal: ఆ ధాన్యం ఇస్తే ఎంతైనా కొంటాం, గతంలోనే ఒప్పందం.. మాపై విమర్శలు సరికాదు: పీయూష్ గోయల్


Also Read: Hyderabad: లేకలేక పెళ్లయింది.. మెట్టింట్లో భార్యకు గ్రాండ్ వెల్‌కం.. కాసేపటికే అందరికీ భారీ షాక్


Also Read: KTR: కేటీఆర్ - కిషన్ రెడ్డి మధ్య ట్వీట్ల వార్.. ఆ రోడ్లు తెరిపించాలని కొనసాగుతున్న నిరసనలు


Also Read: సెక్సీగా కనిపించడం కోసం ఎంత కష్టపడ్డానో.. 'పుష్ప' ఐటెం సాంగ్ పై సామ్ రియాక్షన్..
Also Read: ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన రాధే శ్యామ్ టీమ్‌... రెబల్ స్టార్ లుక్ రిలీజ్!
Also Read: అప్పుడు అనుష్కతో... ఇప్పుడు సమంతతో
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి