Telangana News | మంచిర్యాల: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనేక అక్రమాలు చేస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసం వద్ద మీడియాతో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ.. మంచిర్యాల నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధిలో భాగంగా పనులు జరిగాయి. అందులో మంచిర్యాలకి గుండెకాయ లాంటిది మంచిర్యాల- అంతర్గాం బ్రిడ్జి. 2018లో నడిపెల్లి దివాకర్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కేసీఆర్ హయాంలో 164 కోట్ల రూపాయలతో బ్రిడ్జి మంజూరు చేశారు. మంజూరు చేసిన బ్రిడ్జికి టెండర్ ప్రక్రియ,స్థల సేకరణ, అగ్రిమెంట్, మరియు మట్టి పరీక్షలు కూడా పూర్తయ్యాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ మారిన తర్వాత మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు బీఆర్ఎస్ మీద ఉన్న కోపంతో, ద్వేషంతో, ఈ బ్రిడ్జి పూర్తయితే నడిపెల్లి దివాకర్ రావుకు కూడా పేరు వస్తుందనే దురాలోచన చేస్తున్నారు. ఆ బ్రిడ్జికి బదులుగా ప్రత్యామ్నాయ రోడ్ గా లక్ష్మీ టాకీస్ నుండి అమరవీరుల స్తూపం నుంచి రాళ్ల వాగు నుండి రంగపేట నుండి పాత మంచిర్యాల R&B రోడ్డు వరకు ఈ మధ్యకాలంలో మార్చారు. బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన నిదులు వాడుకుని, మంచిర్యాల అభివృద్ధి చేయకుండా పేరు మార్చి దారి మళ్లించడాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు.
మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి ఎంతో ప్రాధాన్యత గల బ్రిడ్జి. ఒక్కసారి ఆ బ్రిడ్జి మీద నుండి కరీంనగర్ కి వెళితే 18 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రత్యామ్నయ మార్గం అంటూ ప్రజలకు సంతోషం లేకుండా చేసిన ఏకైక వ్యక్తి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఈ బ్రిడ్జి ను పక్కదారి పట్టించి మంచిర్యాల ప్రజలకు అన్యాయం చేసిన నేతగా చరిత్రలో నిలిచిపోతారు. 2028లో అధికారంలోకి వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని, మంచిర్యాలలో ఎగిరేది గులాబీ జెండానే. మంచిర్యాలకి గుండెకాయ లాంటి మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జిని యథా స్థానంలో నిర్మిస్తామని అన్నారు.
మహా ప్రస్థానం నిర్మాణంలో ఎమ్మెల్యే అక్రమాలు4 కోట్ల పనికి రూ.11 కోట్ల బిల్లు పెట్టారు. ప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్యే పదవి బంగారు బాతులాగా కనిపిస్తుంది. మహాప్రస్థానం మొదటగా నాలుగు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని ప్రకటించి తర్వాత దానిని 11 కోట్లకు మార్చారు. అందులో భాగంగా ఎలాంటి అనుమతులు లేకుండా, డబ్బులు కట్టకుండా, మంచిర్యాల గోదావరి నుండి అడ్డగోలుగా ఇసుక, మట్టి అక్రమ రవాణా చేసి మహాప్రస్థానంలో పోశారు. ఆ మట్టి పోసిన టిప్పర్ల యజమానికి ఇసుక మట్టి బయట అమ్ముకునే విధంగా అతనికి వసతులు కల్పించి, ఆ ప్రస్థానంలో ఇసుక మట్టి పోశారు.
మహాప్రస్థాన నిర్మాణంపై విచారణ జరిపి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో పాటు హకరించిన అధికారులపై పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహాప్రస్థానం నిర్మించిన భూదాన్ భూమి కూడా ఒకప్పుడు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్రమార్కుల నుండి ఈ భూదాన్ భూమిని కాపాడి, ప్రభుత్వానికి అప్పజెప్పిన భూమి అని నడిపెల్లి దివాకర్ రావు గుర్తు చేశారు. ఆ భూమిని 8 మంది తలో మూడు ఎకరాల చొప్పున కబ్జా కి కుట్ర చేశారు అని అన్నారు. ఇప్పుడు మీరు నిర్మించిన స్మశాన వాటికను అక్కడ నిర్మించడం వల్ల దాన్ని చుట్టుప్రక్కల ఉన్న 24 ఎకరాల భూమి నిరుపయోగంగా మారింది. ఈ మహాప్రస్థానంలో దాన సంస్కారాలు చేసినప్పుడు, అటుగా పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు స్మశాన వాటిక నుండి వచ్చి పొగ మీదగా రాకపోకలు కొనసాగించాలి. అదేవిధంగా పుష్కర ఘాటు మీదకు, దేవాలయాల మీదకు, ఇళ్ళ మీదకు కూడా స్మశాన వాటిక నుండి ఒక వస్తుంది అని అన్నారు.
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గోదావరి నది ఒడ్డున కొనుగోలు చేసిన భూమిలో స్మశాన వాటిక నిర్మిస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అక్కడ స్మశాన వాటిక నిర్మిస్తే దివాకర్ రావుకి పేరు వస్తుందనే అక్కసుతో అక్కడ నిర్మించలేదని అన్నారు. ఆ మహాప్రస్థానం వద్ద ఒక అమాయ యువకుడు 31-01-2025 రోజున కరెంట్ షాక్ తో మరణిస్తే ఆ విషయాన్ని కూడా బయటకు రాకుండా చూశారు. మహాప్రస్థానం ప్రభుత్వ నిర్మాణం కాబట్టి దానిని ప్రభుత్వమే మెయింటైన్ చేయాలి కానీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యాపారస్తుల నుండి కుల సంఘాల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇది ప్రభుత్వ పరంగానే మెయింటైన్ చేయాలన కోరారు. ఐబి నుండి క్యాతన్ పల్లి వరకు రోడ్డు మరమ్మతుల కొరకు 35 కోట్ల రూపాయలతో మంజూరు చేపించి శంకుస్థాపన చేశాం. దానికి పేరు మార్చి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మళ్లీ శంకుస్థాపన చేశారు.
ప్రతి పనికి డబ్బులు కావాలనే ఏకైక ఎమ్మెల్యేమంచిర్యాల నియోజకవర్గంలోని ఎసిసి క్వారీలో ఉన్న భూమి, ఆ భూమిని ఇండస్ట్రియల్ భూమిని రెసిడెన్షియల్ భూమిగా మార్చడానికి ఆ ప్రాంత ప్రజలను పిలిపించి లక్షలాది రూపాయలు కావాలని చెప్పించారు. ఇలా ప్రతి విషయానికి డబ్బులు కావాలే ఏకైక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అని దివాకర్ రావు అన్నారు.. డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా ఎదురు మాట్లాడితే వారిని భయభ్రాంతులకు చేయడానికి ఒక గ్యాంగ్ ను తయారు చేశారని ఆరోపించారు.
అక్రమ మట్టి తవ్వకాలకు సహకరిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యేమంచిర్యాల నియోజకవర్గంలోని ఇటిక్యాల, లక్ష్మీపూర్, గడ్ పూర్ అమలలోని చెరువులలో అక్రమంగా అనుమతులకు మించి మట్టిని అధిక మొత్తంలో పక్కదారి పట్టిస్తున్నారని దివాకర్ రావు ఆరోపించారు. ఉదాహరణ ఒక చెరువు లోని మట్టి 500 మెట్రిక్ టన్నులు తీయడానికి అనుమతులు తీసుకున్నారు. 500 మెట్రిక్ టన్నుల తీయడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే పడుతుంది కానీ ఏకంగా 15 రోజులు అనుమతులు తీసుకొని వారి ఇష్టానుసారంగా తవ్వకాలు జరిపారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ అర్ధరాత్రి పోలీసుల, ఇతర అధికారుల భద్రతతో తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనిపై అధికారులు వెంటనే విచారణ చేపట్టి, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.