Dilawarpur Ethanol Industry Latest News: నిర్మల్‌ జిల్లాలోని దిలావర్‌పూర్‌లో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ పరిశ్రమ వివాదంలో కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తూ స్థానికులు కొన్నిరోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ప్రజా స్పందన చూసి పునరాలోచనలో ప్రభుత్వం పడ్డట్టు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన కలెక్టర్‌ ఇథనాల్‌ పరిశ్రమ పనులు నిలిపివేయాలని ఆదేశించారు. అక్కడ పనులు స్థితి, ప్రజల అభిప్రాయాలు ఇతర అంశాలతో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఇక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందో చూడాలి. 


Also Read: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు


ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటును రద్దు చేయాలని కోరుతూ  దిలావర్‌పూర్‌ ప్రజలు కొన్ని రోజులు ధర్నలు చేస్తున్నారు. పురుగుల మందు డబ్బాలతో నిరసనలకు కూర్చున్నారు. మహిళలు గళం విప్పారు వారికి మద్దతుగా మిగతా ప్రజలు కూడా నిరసన చేపట్టారు. దీంతో ఈ విషయం మరింత తీవ్రంగా మారడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. 


పరిస్థితి చక్కదిద్దేందుకు పోలీసులు కొందరిని అరెస్టు చేయడం కూడా ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పించింది. అప్పటి వరకు ఒక ప్రాంతానికి పరిమితమై ధర్నాలు చేస్తున్న ప్రజలు ఏకంగా రోడ్డు ఎక్కారు. రైతులు, మహిళలు పోలీసుస్టేషన్‌ నుంచి నిర్మల్‌- భైంసా రహదారి వరకు ఆందోళనబాటపట్టారు. మంగళవారం ఉదయం నుంచి కంటిన్యూగా ధర్నా చేస్తుండటంతో అధికారులు వారిని చర్చలకు పిలిచారు. రైతులతో కలెక్టర్ అభిలాష అభినవ్‌ మాట్లాడుతున్నారు. 


Also Read: తెలంగాణలో మరో స్కూల్లో ఫుడ్ పాయిజన్, 21 మంది విద్యార్థులకు అస్వస్థత


రైతులతో మాట్లాడిన కలెక్టర్ అభిలాష... వాస్తవ పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని అన్నారు. ప్రస్తుతానికి ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసినట్టు రైతులకు, స్థానిక ప్రజలకు వివరించారు. పరిస్థితి తీవ్రను ప్రభుత్వం గుర్తించినందున ఆందోళన విరమించాలని రైతులను కలెక్టర్ కోరారు. 


అయితే కలెక్టర్ సూచనను ప్రజలకు తిరస్కరించారు. ప్రభుత్వం నుంచి లఖిత పూర్వక హామీ వస్తే తప్ప తాము దీక్షలు విరమించేది లేదని తేల్చి చెప్పారు. అప్పటి వరకు కుటుంబాలతో రోడ్లపైనే ఉంటామన్నారు. ప్రజల ధర్నా కారణంగా ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 


Also Read: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ