హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు డిసిసి అధ్యక్షులు నులను ఎఐసిసి ఖరారు చేసింది. తెలంగాణలోని 33 జిల్లాలతో పాటు, మూడు కార్పొరేషన్లకు సైతం అధ్యక్షులను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ 3 జిల్లాలకు డీసీసీ అధ్యక్షు సైతం కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోను నలుగురు డిసిసి అధ్యక్షులను నియమించారు. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జును ఖరారు చేయగా... ఆదిలాబాద్ జిల్లా డిసిసి డా. నరేష్ జాదవ్, ఆసిఫాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షులుగా ఆత్రం సుగుణ, మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షుడిగా రఘునాథ రెడ్డి లులను ఏఐసీసీ నియమించింది.

Continues below advertisement




ఆదిలాబాద్ జిల్లా డిసిసి అధ్యక్షుడిగా డా. నరేష్ జాదవ్


ఇందులో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జుకు నిర్మల్ జిల్లా డిసిసి పదవి ఖరారు చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులను ఏకం చేసి నియోజకవర్గంలో పార్టీని గెలిపించారు. సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా కూడా గుర్తింపు పొందడంతో ఆయన్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే దిశగా ముందస్తుగానే ఏఐసీసీ డిసిసిలను ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు.