Duty exemption only to Muslim employees | ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ చూసిన. రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం 4 గంటలలోపే విధులను ముగించుకుని వెళ్లిపోవచ్చని మినహాయింపు ఇచ్చారు. మరి అయ్యప్ప, హనుమాన్, భవానీ భక్తులు ఏం పాపం చేశారు? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) ప్రశ్నించారు. అయ్యప్ప మాల వేసుకునే భక్తులు భిక్ష చేయడానికి ఎన్ని ఇబ్బందులుంటాయో అందరికీ తెలుసు. మధ్యాహ్నం భిక్ష చేయకుండా పస్తులుండి దీక్ష తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ టైంకు రాకుంటే సస్పెండ్ చేస్తారనే భయంతో డ్యూటీలకు పోతరు. అట్లాగే భవానీ భక్తులు, హనుమాన్ భక్తులదీ అదే పరిస్థితి. కానీ రంజాన్ భక్తులకు మాత్రమే మినహాయింపు ఎట్లా ఇస్తారు? అని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ లోని హిందువులారా.. మీలో నిజంగా హిందూ రక్తమే ప్రవహిస్తే నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ హిందువైతే కాదు..
మంచిర్యాలలో మంగళవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తోపాటు బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ బీసీ కాదని, ఆయన కులం గురించి కాంగ్రెస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నరు. అసలు రాహుల్ ఖాన్ గాంధీ తండ్రి పేరు ఏమిటి? ఫిరోజ్ ఖాన్ గాంధీ... మీ పేర్లలో ఆయన పేరు కలుపుకుని గాంధీ పరువు తీస్తున్నరు. మహాత్మాగాంధీ ఆత్మ బాధపడుతోంది. ఫిరోజ్ ఖాన్ గాంధీ కుమారుడు, మనవడు ఏమైతరు చెప్పండి? హిందువులైతే కానే కాదు... అందులో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ నేతలను అడుగుతున్నా... మీరు హిందువులేనా? మీలో హిందువు రక్తం ప్రవహిస్తుందా? అని ప్రశ్నించారు.
రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే డ్యూటీ ముగించుకుని వెళ్లిపోవచ్చు అని సర్క్యూలర్ ఇచ్చారు. మరి అయ్యప్ప, భవానీ, హనుమాన్ మాల వేసే భక్తులు ఏం పాపం చేశారు? అయ్యప్ప మాల వేసే భక్తులకు భిక్ష చేయడానికి ఎదురయ్యే ఇబ్బందులు అందరికీ తెలుసు. డ్యూటీ ఉందని మధ్యాహ్నం భిక్ష చేయని కారణంగా పస్తులుండి దీక్ష కొనసాగిస్తారు. టైంకు రాకుంటే సస్పెండ్ చేస్తారనే భయంతో డ్యూటీలు చేస్తుంటారు. హనుమాన్, భవానీ భక్తులకు ఇదే సమస్య ఉంది. కానీ కేవలం రంజాన్ సందర్భంగా ముస్లింలకు మాత్రమే మినహాయింపు ఇవ్వడం సరికాదు. ఇలాంటి విషయాలు మతాలకతీతంగా ప్రశ్నిస్తే బీజేపీ నేతల్ని మతతత్వ వాదులంటారా? అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూ రక్తం ప్రవహించడం లేదా?
‘పలు దేశాల్లో నిషేధిత తబ్లిగీ జమాతే సంస్థ సమావేశాలు నిర్వహిస్తే... 2.5 కోట్ల ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తారా? కాంగ్రెస్ నేతలలో హిందువులు లేరా ? మీలో హిందూ రక్తం ప్రవహించడం లేదా? బీసీ హిందువుల్లో ముస్లింలను ఎట్లా కలుపుతారు?. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని చెప్పి.. అందులో 10 శాతం ముస్లింలను కలిపితే బీసీలకు అన్యాయం జరిగదా? బీసీలలో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు. లేకపోతే ఆ జాబితాను కేవలం లామినేషన్ చేసుకుని ఇంట్లో పెట్టుకోవడం తప్ప ప్రయోజనం ఉండదు. రాష్ట్రంలో ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే కనుక భవిష్యత్తులో తెలంగాణ ఎన్నికల్లో గెలిచేది ముస్లింలే. విర్రవీగుతున్న కాంగ్రెస్ నేతలకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మేధావి వర్గంపై ఉందని’ బండి సంజయ్ ప్రసంగించారు.