సీఎం కేసీఆర్ పుట్టిన రోజు(CM Kcr Birthday Celebrations)ను పురస్కరించుకుని మూడు రోజుల పాటు సెలబ్రేషన్స్ ఇవాళ స్టార్ట్ అయ్యాయి. మంత్రి కేటీఆర్(Minister KTR) పిలుపు మేరకు ఈ నెల 17న సీఎం కేసీఆర్ జన్మదినం వేడుకులను మూడు రోజుల పాటు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ(TRS Party) నిర్ణయించింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో 15,16,17 తేదీల్లో జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీఆర్ఎస్ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.  ఇవాళ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మున్సిపాలిటీ కేంద్రంలోని బాపూజీ నగర్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Prashanth Reddy) పాల్గొన్నారు.


విద్యుత్ వినియోగంలో నెంబర్ వన్ 


చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్(Kcr) అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై 15 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించారన్నారని గుర్తుచేశారు. తెచ్చుకున్న తెలంగాణ(Telangana) రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలిపారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పంజాబ్ కన్నా ఎక్కువ ధాన్యం పండుతుందన్నారు. విద్యుత్ వినియోగంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నందని మంత్రి అన్నారు. ఇవాళ తెలంగాణలో మూడెకరాల భూమి ఉన్న రైతు కోటీశ్వరుడన్నారు. ఇక్కడి సంక్షేమ కార్యక్రమాలు చూసి పొరుగు రాష్ట్రాల ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో తమ గ్రామాలు విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. 


తెలంగాణ దేశానికే మోడల్ 


స్వయంగా కర్ణాటక మంత్రి కూడా తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని అన్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ(Mission Bhageeradha) వంటి కార్యక్రమాలు ఆయా రాష్ట్రాల్లో అమలు చేయాలని చూస్తున్నాయన్నారు. చెక్ డ్యాముల నిర్మాణం దేశానికే ఒక మోడల్ గా నిలిచిందన్నారు. ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న కేసీఆర్ ను ప్రజలు భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. వ్యక్తిగతంగా తనకు కూడా కేసీఆర్ ను ప్రధానమంత్రి(Prime Minister)గా చూడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. జీవితాంతం ఆయన ప్రజా పాలనలో కొనసాగితే ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి లాంగ్ లివ్ కేసీఆర్(Kcr) అంటూ నినాదాలు చేశారు.


Also Read: రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి దోస్తానా ! టీ కాంగ్రెస్‌కు కొత్త ఊపు వచ్చినట్లేనా ?