New Ration Cards In Telangana: రేషన్ కార్డుల లిస్టులో మీ పేరు లేదా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

Telangana New Ration Cards | తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి అంతా సిద్ధం చేశారు. ఇదివరకే లబ్దిదారుల జాబితా ఎంపిక చేయగా, మీ పేరు లేకపోతే కార్డు కోసం గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Continues below advertisement

Telangana Ration Cards | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జనవరి 26న మరిన్ని పథకాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉంది. కొన్ని పథకాలకు లబ్ధిదారుల జాబితాపై అదేరోజు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో గత పదేళ్లుగా రేషన్ కార్డులు జారీ చేయలేదని తెలిసిందే. తప్పులు, మార్పులు చేర్పులకు సైతం దశాబ్దకాలం నుంచి ప్రజలకు అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. ఈనెల 26న 4 పథకాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Houses), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా (Rythu Bharosa) పథకాలకు లబ్దిదారుల ఎంపికపై రాష్ట్ర వ్యాప్తంగా కసరత్తు జరుగుతోంది. 

Continues below advertisement

ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోలేదా? నో ప్రాబ్లమ్
ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల అర్హుల జాబితాను ఇదివరకే రూపొందించింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నా తమ పేరు లేదని కొందరు, రేషన్ కార్డు లేదని లబ్దిదారుల జాబితాలో తమ పేరు చేర్చలేదని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జనవరి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన లబ్దిదారులు కొత్త రేషన్ కార్డు కోసం ఈ గ్రామ సభలలో పాల్గొని తమ వివరాలతో దరఖాస్తు సమర్పించాలని మంత్రులు, అధికారులు సూచించారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డు లబ్ధిదారుల జాబితలో పేర్లు లేకపోతే మంగళవారం నుంచి జరుగుతున్న గ్రామసభల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 

గ్రామసభలలో దరఖాస్తులకు అవకాశం

తెలంగాణ వ్యాప్తంగా 11,65,052 మందికి సంబంధించి 6,68,309 కార్డుల కోసం సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. అయితే తమ పేర్లు లేవని అనుమానం ఉన్నవారు చెక్ చేసుకుని వివరాలు సమర్పించాలని ఛాన్స్ ఇచ్చారు. ఈనెల 24న వరకు జరిగే గ్రామ సభలలో ప్రజల నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. గ్రామ సభలలో లబ్దిదారులు తమ కుటుంబ పెద్ద పేరు, ఇతర కుటుంబసభ్యుల వివరాలు, అడ్రస్, ఇతర వివరాలు నింపి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ద్వారా వివరాలు సమర్పించి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుందని ఊరట కలిగించే న్యూస్ అందించారు.

రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల కుటుంబాలకుగానూ ఇప్పటికే 90 లక్షల రేషన్ కార్డులున్నాయి. మరో కోటి కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేయనుంది. గ్రామసభలు, బస్తీ సభలు నిర్వహించి జనవరి 24 వరకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి త్వరలో జాబితా ప్రకటించనుంది ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లకు, ఇతర పథకాలకు లబ్దిదారుల ఎంపికకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటారని తెలిసిందే. రేషన్ కార్డులు లేకపోతే గత పదేళ్ల నుంచి కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం సైతం చేయించుకోలేకపోతున్నారు.

Also Read: Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క

Continues below advertisement