World Economic Form: స్విట్లర్లాండ్‌లోని దావోస్‌(Davos)లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55 వ వార్షికోత్సవ సదస్సుకు విశేష స్పందన లభించింది. తొలిరోజు సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి పెద్దఎత్తున పారిశ్రామికవేత్తలు,పెట్టుబడిదారులు తరలివచ్చారు. వారిని ఆకర్షించేందుకు దేశాల ప్రతినిధులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు తరలివచ్చారు. మూడురోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో ఈసారి ‘ఇండస్ట్రీస్ ఇన్ ఇంటిలిజెంట్ ఏజ్' అనే థీమ్‌ను వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (World Economic Form)ఎంచుకుంది. శాస్త్ర సాంకేతిక ఆధునాతన పరిజ్ఞానానకిి అనుగుణంగా  పారిశ్రామిక వ్యూహాల మార్పు, పెరుగుతున్న ఇంధన అవసరాలు సమకూర్చుకోవాలనే ఇతివృత్తంతో  రౌండ్‌టేబుల్ సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు,రాష్ట్రాల ప్రతినిధులతోపాటు పరిశ్రమలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు దాదాపు 3 వేల మంది ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నారు. తొలిరోజు సమావేశానికి హాజరైన తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు  రెండోరోజు కూడా వివిధ సదస్సులు, సమావేశాల్లో పాల్గొననున్నారు. 

ప్రోత్సహకాలపై ప్రముఖ కంపెనీలు ఆసక్తి  తెలంగాణ(Telangana)లో ఇటీవలే అమల్లోకి వచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ,పునరుత్పాదక ఇంధనంం, పంప్డ్‌స్టోరేజీ విద్యుత్ ఉత్పత్తికి  రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్ అందిస్తున్న ప్రోత్సహకాలపై ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. తెలంగాణలో ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ సాయం, రాయితీలపై బేరీజు వేసుకుని ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.అలా ముందుకు వచ్చిన ఆయా సంస్థలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం చర్చలు జరుపుతోంది. ఇంధన ఉత్పత్తితోపాటు  హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న  ఫోర్త్‌సిటి, ఏఐ ఆధారిత ఐటీ సేవల విస్తరణపై వివిధ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అత్యాధునిక డేటా సెంటర్ల  ఏర్పాటుకు  పెట్టుబడులు పెట్టేందుకు సంప్రదింపులు జరుపుతున్నాయి. రెండోరోజు పలు కంపెనీల సీఈవోలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం సమావేశం కానుంది. అమెజాన్‌, యూనీలివర్‌, స్కైరూట్‌ ఏరోస్పేస్‌, సిఫీ టెక్నాలజీస్‌ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు.

పారిశ్రామికవేత్తలతో రేవంత్‌రెడ్డి సమావేశం

  సీఐఐ(CII) సారథ్యంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశంకానున్నారు. ఐటీ, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి బృందం ప్రయత్నాలు చేస్తోంది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంటోంది. గతేడాది దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం రూ. 40,232 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాయి. మొత్తం 14 సంస్థలు ముందుకురాగా...18 ప్రాజెక్ట్‌లకు ఒప్పందాలు జరిగాయి. వాటిల్లోఇప్పటికే 17 ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి.  ఆకర్షించగా...ఈసారి అంతకన్నా ఎక్కువే  పెట్టుబడులు  వస్తాయని భావిస్తున్నారు. ఫోర్త్‌సిటీపై ప్రత్యేకంగా దృష్టిసారిచిన సీఎం రేవంత్‌రెడ్డి...అక్కడికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.