KTR Addressing a public meeting in Nagarjuna sagar: ఓ పెద్దాయన నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గానికి సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా వహించారు, కానీ ఇక్కడి ప్రజలకు మాత్రం చేసిందేమీ లేదన్నారు తెలంగాణ ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్. నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న‌లు చేశారు. నాగార్జున సాగర్‌లో పర్యటించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి, ఏడు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నేత చేసిన అభివృద్ధి శూన్యం అని మండిపడ్డారు. ఆ పెద్దాయన ఆర‌డుగుల అజానుబాహుడు కానీ, ఈ ప్రాంత ప్రజలకు ఆరు గంట‌ల క‌రెంట్ కూడా రాలేద‌ని విమ‌ర్శ‌ించారు.


ఆ పెద్దాయన వల్ల ప్రయోజనం శూన్యం.. 
సీఎం కేసీఆర్ మనవడు, మనవరాలు హైదరాబాద్ లో ఏ సన్న బియ్యం తింటున్నారో అలాంటి సన్న బియ్యం అంగన్ వాడీలు, బీసీ, ఎస్సీ హాస్టల్స్‌లో అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు కేటీఆర్. ఓ పెద్దాయన ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. పక్కనే కృష్ణా నది ఉన్నా, మీకు నీళ్లు తెచ్చి ఇవ్వలేని అసమర్థత ఆయనది. ఆయన అంటే తనకెంతో గౌరవమని, కానీ ఆయన చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాగార్జున సాగర్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు అందలేదన్నారు. ప‌క్క‌నే కృష్ణా న‌ది ఉన్నా ప్రజలు ఫ్లోరోసిస్ సమస్యతో ఇబ్బందులు పడ్డారు. కనీసం సాగు నీరు ఇచ్చారా అంటే అదీ లేదని కేటీఆర్ విమర్శించారు.






ఏడు, ఎనిమిది సార్లు గెలిపించిన నేతలు పనిచేసిన సమయంలో ఓ ముసలి అవ్వ లేక తాత వద్దకు మనవడు, మనవరాళ్లు వచ్చి రూ.10 ఇవ్వవా టికెట్ కొనుక్కుంటా అని అడిగితే ఇచ్చే పరిస్థితి లేదన్నారు. సీఎంగా కేసీఆర్ అయ్యాక, పరిస్థితి మారిపోయింది. అత్తమ్మా కాఫీ తాగుతవా అని అడిగే పరిస్థితి, పెద్దవాళ్ల ఆత్మగౌరవాన్ని పెంచిన నేత కేసీఆర్ అని పేర్కొన్నారు. రూ.200 గా ఉన్న పింఛన్లను రూ. 2 వేలకు పెంచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. వికలాంగులు, వితంతువులకు సైతం పింఛన్లు పెంచి ఆసరాగా నిలిచామని చెప్పారు.


పెళ్లి ఖర్చులు, ఆసుపత్రి వసతి.. 
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి మారింది. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్  నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అని సినిమా వాళ్లు పాటలు కూడా రాశారు. కానీ నేడు మహిళలు డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు. మా మేనమాళ కేసీఆర్ మగబిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు ఇస్తున్నారని గుర్తుచేశారు. అంగన్ వాడీల నుంచి చిన్నారులకు ప్రయోజనాలు అందుతున్నాయి. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ మనవడు, మనవరాలు ఏ సన్నబియ్యం తింటున్నారో, అదే బియ్యం అందిస్తున్న దేశంలోని ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని కేటీఆర్ పేర్కొన్నారు. 


Also Read: Amit Shah In Hyderabad : అమిత్ షాకు తెలంగాణ పార్టీల ప్రశ్నాస్త్రాలు - సభలో సమాధానాలిస్తారా ?


Also Read: Revanth Reddy: భద్రాద్రి రాముడు దేవుడు కాదా? అమిత్ షా Hyd టూర్‌ వేళ రేవంత్ రెడ్డి 9 ప్రశ్నలు