వరంగల్‌(Warangal)లో మే6న జరిగే రాహుల్(Rahul Gandhi) సమావేశానికి ఇంటికో వ్యక్తి రావాలని తెలంగాణ పీసీసీ(Telangana PCC ) చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy)పిలుపునిచ్చారు. సాగర్ పర్యటనకు వెళ్తూ మార్గమధ్యలో రైతులతో మాట్లాడారు. నల్గొండ మార్గ మధ్యంలో పొలాలలో పని చేసుకుంటున్న రైతులతో కాసేపు ముచ్చటించారు.


తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోదీ రైతులను నట్టేటా ముంచారని... ఇద్దరూ రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు రేవంత్ రెడ్డి. లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ మోసం చేశారని..ఆ విషయాన్ని మర్చిపోయా.. ఏమి చెయ్యలేదురని విమర్శించారు.


వరి వేస్తే ధాన్యం కొనకుండా నష్టం చేశారని అన్ని రేట్ల ఇష్టారాజ్యంగా పెరిగిపోయాయని రేవంత్‌ వద్ద రైతులు వాపోతాయారు. కేసీఆర్‌, మోదీ ఇద్దరూ కలిసి రైతులను, ప్రజలను నిండా ముంచారని రైవంత్ బదులిచ్చారు. అందుకే రైతు సమస్యల పరిష్కారం కోరుతూ రాహుల్ సభ పెట్టినట్టు చెప్పుకొచ్చారు రేవంత్. సభ ఎంత విజయవంతమైతే ప్రభుత్వం అంత భయపడుతుందని.. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. అందుఇంటికో రైతు వచ్చి రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయాలన్నారు.






రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ 6వ తేదీన వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేసింది తెలంగాణ కాంగ్రెస్. దీనికి భారీగా జన సమీకరణ చేస్తోంది. ఎలాగైనా ఈ సభను విజయవంతం చేసి  ఇలాంటి సభలు మరిన్ని పెట్టించాలని ప్లాన్ చేస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది.


రాహుల్ గాంధీ ఐరాన్ లెగ్గని... ఎక్కడ అడుగు పెట్టిన కాంగ్రెస్ 94 శాతం ఓడిపోతుందన్నారు మంత్రి హరీష్ రావు. వాళ్ల సభల గురించి పెద్దగా భయపడాల్సిందిగానీ.. మాట్లాడాల్సింది గానీ లేదన్నారు. వాళ్ల నాయకత్వం చేస్తున్న పనులు ఆ పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇక ప్రజలు ఎలా పట్టించుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన గురించి ప్రజలందరికీ తెలుసని ప్రత్యేకంగా చెప్పాల్సిందే లేదన్నారు.