ఈ ఏడాది చివరి ఎడిషన్ అయిన మన్ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ తెలంగాణ వ్యక్తి పేరును ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2021 సంవత్సరానికి సంబంధించిన చివరి ఎడిషన్ మన్ కీ బాత్ ఆదివారం ఉదయం ప్రసారం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ తెలంగాణకు చెందిన 84 ఏళ్ల విశ్రాంత ఉపాధ్యాయుడు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గురించి మాట్లాడారు. ఆయన పేరును ప్రత్యేకంగా ప్రస్తావించి.. ఆయన గురించి చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..  కలలు కనడానికి వయస్సుతో పట్టింపు లేదని ఆయన్ను ఉదాహరణగా చేసుకొని చెప్పారు. పుస్తకాల విషయంలో ఆయన చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు.


పుస్తకాలు కేవలం జ్ఞానాన్ని ఇవ్వడమే కాకుండా.. మన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో విశ్రాంత ఉపాధ్యాయుడు విఠలాచార్య ఏర్పాటు చేసిన గ్రంథాలయం, అందుకోసం ఆయన చేసిన కృషిని ప్రధాని ప్రశంసించారు. దేశంలో ఉన్న అసాధారణ ప్రతిభావంతుల గురించి మోదీ మాట్లాడుతూ.. “మన భారతదేశం అనేక అసాధారణ ప్రతిభలతో నిండి ఉంది. వారి సృజనాత్మకత ఇతరులను ఏదైనా చేయటానికి ప్రేరేపిస్తుంది. అలాంటి వ్యక్తి తెలంగాణకు చెందిన కూరెళ్ల విఠలాచార్య గారు. ఆయన వయస్సు 84 ఏళ్లు. చిన్నప్పటి నుండి విఠలాచార్య ఒక పెద్ద లైబ్రరీని తెరవాలనే కోరిక ఉండేది. కానీ, ఆయన చిన్నతనంలో బ్రిటిషు వారి విధానాలు, ఇతర కారణాల వల్ల అతని కల ముందుకు వెళ్లలేదు. తర్వాత తానే స్వయంగా లెక్చరర్‌గా మారి తెలుగు భాషలో ఎన్నో అధ్యయనాలు చేసి ఎన్నో స్వరకల్పనలు చేశారు.’’ అని ప్రధాని మోదీ విఠలాచార్య గురించి తెలిపారు.


లైబ్రరీ ఏర్పాటుకు ఎంతో ఖర్చు
‘‘అనేక పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేసిన విఠలాచార్య అందుకోసం ఆయన జీవితకాలం దాచుకున్న డబ్బునంతా ఖర్చుచేశారు. క్రమంగా ప్రజలంతా ఆయనతో చేతులు కలిపి.. గ్రంథాలయ విస్తరణలో భాగస్వాములు అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఉన్న ఈ గ్రంథాలయంలో ప్రస్తుతం 2 లక్షల వరకు పుస్తకాలు ఉన్నాయి. చదువుకునేందుకు తాను పడిన కష్టాలు మరెవరూ పడొద్దని విఠలాచార్య ఆకాంక్షించారు.’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.


Also Read: డ్రగ్స్ కేసు భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్


ఈ సందర్భంగా స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్ల వినియోగం గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘‘ఎప్పుడైతే మనం స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ స్ర్కీన్లను చూడడంపై సమయం అధికంగా వెచ్చిస్తున్నామో.. అదే సమయంలో పుస్తకాలు చదవడానికి కూడా సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది మీరు ఏ పుస్తకాలు చదివారో అందరికీ షేర్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఇతరులు 2022లో ఏ పుస్తకాలు చదవాలో తెలుసుకుంటారు.’’ అని మోదీ అన్నారు.


Also Read: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికితే ఇక అక్కడ కూడా మీ పరువు పోయినట్టే..! పోలీసుల కొత్త ఐడియా


Also Read: Hyderabad: తల్లి కళ్లెదుటే కొడుకుల రక్తపాతం.. ఒకరు మృతి, కదల్లేని స్థితిలోనే మౌనంగా రోదిస్తూ..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి