Minister Jagadish Reddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి... లక్ష మంది స్థానికులతో లక్ష జన హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎడారిగా మారిన జిల్లాకు ఎస్సారెస్పీ ద్వారా కాళేశ్వరం నీటిని అందించినందుకు ముఖ్యమంత్రికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అందుకుగాను కాళేశ్వరం జలాలకు జన హారతి కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లాలో తిరుమలగిరి మండలం ఈటూరు నుంచి పెన్ పహాడ్ మండలం రావి చెరువు వరకు మొత్తం 68 కిలో మీటర్ల మేర ఎస్సారెస్పీ కాలు వెంట స్థానిక ప్రజలు గోదావరి జలాలలకు జల హారతిని సమర్పించారు.
చివ్వెంల మండల కేంద్రంలో జగదీష్ రెడ్డి కాళేశ్వరం జలాలకు జలహారతిని సమర్పించారు. నీటి కరవుతో ఇబ్బందులు పిడన నేల.. నేడు సస్యశ్యామలంగా మారడానికి కారణం ముఖ్యమంత్రేనని వెల్లడించారు. మొదట బోరు బావులు ఉపయోగించి వెయ్యి అడుగుల వరకు వెళ్లిన నీటి లభ్యతలేని ప్రాంతంగా ఉండేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం జలాలతో సాగునీటికి ఎలాంటి కొరత లేకుండా చేశారని చెప్పారు.
వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం..
మంత్రి జగదీష్ రెడ్డి చేపట్టిన "కాళేశ్వరం నీరు - లక్షల జన హారతి" కార్యక్రమానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం లభించింది. ఈక్రమంలోనే ప్రతినిధులు మెడల్ తో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మంత్రి ఈ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చిన వెంటనే వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ సంస్థ ప్రతినిధులు రంగంలోకి దిగి అధ్యయనం చేశారు. ఐడబ్ల్యూఎస్ఆర్ ఇండియా చీఫ్ డా. బి. నరేందర్ గౌడ్, తెలంగాణ కోఆర్డినేటర్ ఎ. గంగాదర్ లు.. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 7 మండలాల్లో పర్యటించారు. కాళేశ్వరం నీళ్లలో లక్ష మందితో లక్ష మంది పాల్గొన్నారని, ఈ కార్యక్రమంలో లక్షా 16 వేల 142 మంది పాల్గొన్నారని బృందం నిర్ధారించింది. వీరిలో 65 వేల 42 మంది మహిళలు ఉండగా.. 51,100 మంది పురుషులు పాల్గొన్నట్లు తెలిపింది.
సూర్యాపేట మండలానికి చెందిన 19881 మందిలో 8625 పురుషులు, 11,256 మహిళలు, చివ్వెంకు చెందిన 10,454 మంది మహిళలు, 9785 మంది పురుషులు, పెన్ పహాడ్ కు చెందిన 11935 మహిళలు, 8125 మంది పురుషులు, ఆత్మకూర్ ఎస్ కు చెందిన 10156 మహిళలు, 95821 మంది పురుషులు, 95825 మంది పురుషులు, 95825 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ లక్ష జన హారతి ముగిసిన తర్వాత.. ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేదికపైనే మంత్రి జగదీశ్‌రెడ్డికి ఘనంగా సన్మానం చేశారు. సంస్థ నిర్వాహకులు.. మంత్రి జగదీష్ రెడ్డికి మెడల్‌తో పాటు మెమెంటో సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో పాటు ఆసాంతం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్ నిర్వాహకులు, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌లను ఘనంగా సత్కరించారు.