Boora Narsaiah Goud Likelely To Join BJP: అనుకున్నట్లుగానే టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు. గత లోక్ సభ ఎన్నికల్లో గెలుస్తానని భావించినా కొన్ని ఇతర పార్టీల గుర్తుల కారణంగా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినట్లు చెప్పారు. పదవుల కోసం పైరవీలు చేసే వ్యక్తిత్వం తనది కాదని తెలిసినా, ప్రజా సమస్యలు విన్నవించేందుకు కూడా కేసీఆర్ తనకు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు టికెట్ అసలు నాకు సమస్యనే కాదని మరో సంచలనానికి తెరతీశారు. బడుగు బలహీన వర్గాల సమస్యలు తాను పదే పదే ప్రస్తావించడంతో కేసీఆర్ తనపై అసహనం వ్యక్తం చేయడం ఓ ఉద్యమకారుడిగా తనను బాధించిందని పేర్కొన్నారు. తన అవసరం పార్టీకి లేదని గుర్తించి టీఆర్ఎస్ నుంచి తప్పుకున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ కాంట్రాక్టర్ల ఏడాది టర్నోవర్, ఇతర ప్రాంత కాంట్రాక్టర్ల TDS అంత కూడా లేదన్నారు. 


కేసీఆర్‌ను కలవాలంటే తెలంగాణ కంటే పెద్ద ఉద్యమం..
తెలంగాణ సాధన ఉద్యమంలో పోరాడిన సహచర ఉద్యమకారులు, మిత్రులు కూడా కనీసం ఒక నిముషం కేసీఆర్‌ను కలవాలంటే తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం చేయవలసి వస్తుంది అనే పరిస్థితి ఉందని తన రాజీనామా లేఖలో బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన ఆచార్య జయశంకర్ విగ్రహం హైదరాబాద్ లో ప్రభుత్వం తరపున పెట్టకపోవడం, అందరిని బాధిస్తున్న
అంశమన్నారు. 
పార్టీకి చెడ్డ పేరు తెచ్చే నిర్ణయాలు..
ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు వలన టీఆర్ఎస్ నేతలకు చెడ్డు పేరు వస్తుందన్నారు. ధరణి, జిపి లేఔట్స్ రెజిస్ట్రే షన్స్ బ్యాన్ చేయడం, దళితుల అసైన్డ్ భూములు తీసుకోని ప్రభుత్వం లై ఔట్స్, సర్పంచులకు ఉప సర్పంచ్ సంతకం అనే అంశాలు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాయని, కేసీఆర్ దృష్టికి తీసుకోవద్దామంటే అవకాశమే ఉండదన్నారు. కుల వృత్తులు ఫెడరేషన్స్ నిర్వీర్యం చేయడం, బీసీ, ఈబీసీ పేద పిల్లలకి కేవలం 11% వరకే ఫి రేయింబర్సుమెంట్ ఇవ్వడం లాంటి అనేక అంశాలు పార్టీకి మైనస్ పాయింట్ అయ్యాయి.


ఏపీ వాళ్లు ఉండరనే ప్రచారంతో చిక్కులు..
ఏపీ, ఇతర ప్రాంతాల వాళ్లు సైతం తెలంగాణలో రొయ్యలు అమ్ముకోవచ్చు, లేదా కర్రీ పాయింట్స్ పెట్టుకోవోచ్చు అని ఉద్యమం సమయంలో చెప్పాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా.. ఇక్కడ కేవలం తెలంగాణ ప్రజలు ఉంటారని చెప్పిందన్నారు. తెలంగాణ కాంట్రాక్టర్ల ఏడాది టర్నోవర్, ఇతర ప్రాంత కాంట్రాక్టర్ల TDS అంత కూడా లేదని వాపోతున్నారని బూర నర్సయ్య గౌడ్ సంచలన విషయాలు రాజీనామా లేఖలో ప్రస్తావించారు. 
అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉంది
మాజీ ఎంపీని అయిన తనతో మునుగోడు ఉప ఎన్నికల సందర్బంగా ఏ విషయంలోనూ సంప్రదించలేదు. నియోజకవర్గంలో జరిగిన ఆత్మగౌరవ సభలలో సమాచారం ఇవ్వకున్నా, అవమానాన్ని దిగమింగి ఉన్నాను. అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉంది. మునుగోడు టికెట్ అసలు నాకు సమస్యనే కాదు, కానీ బీసీ సామజిక వర్గానికి టిక్కెట్ ఇవ్వాలని అడగటం కూడా నేరమే అయితే టీఆర్ఎస్ లో ఉండటమే అనవసరం అన్నారు. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో బీసీలకు ఆర్థిక, రాజకీయ, విద్య, రంగాలలో వివక్షకు గురికావడం బాధాకరం అని పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల సమస్యలు కనీసం మీ దృష్టికి తీసుకువచ్చే అవకాశం లేనప్పుడు టీఆర్ఎస్ లో కొనసాగడంలో అర్థం లేదని పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు బూర నర్సయ్య గౌడ్.