Revanth Reddy About Komatireddy Venkatreddy: భువనగిరి: తనతో పాటు కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయ్యే అర్హత మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికే ఉందని తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకమైన సందర్భంలో అధిష్టానం నిర్ణయంతో తనకు సీఎం పదవి వచ్చిందని, తన పదవిని బాధ్యతగా చూశానని.. అహంకారంతో ఈ కూర్చీలో కూర్చోలేదన్నారు. పేదవాడి అభివృద్ధి, సంక్షేమం కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 


కోమటిరెడ్డి బ్రదర్స్ డబుల్ ఇంజిన్ లాంటోళ్లు.. 
కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. జిల్లాలో ఓవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి ఉండగా.. మరోవైపు కోమటి రెడ్డి బ్రదర్స్ పార్టీకి కంచుకోటగా ఉన్నారని రేవంత్ రెడ్డి కితాబిచ్చారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి డబుల్ ఇంజిన్ లాంటోళ్లు. భువనగిరి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని 3 లక్షల మెజార్టీతో ఎంపీగా ఎన్నుకుంటామని ఈ డబుల్ ఇంజిన్ మాటిచ్చిందన్నారు. కిరణ్ ను ఎంపీగా గెలిపిస్తే మూసీని ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. 


పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన నల్గొండ జిల్లా 
నల్గొండ జిల్లా ఎన్నో పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది. నల్గొండ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ. ప్రధాని నరేంద్ర మోదీ దెబ్బకు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు కుప్పకూలుతున్నాయన్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి విపక్షాలను బెదిరించేందుకు వినియోగిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ సంస్థానంగా మొదలైన పోరాటం విముక్తి పొందింది. దొరల గడీల నుండి బంధ విముక్తి చేసింది ఈ ప్రాంతం. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు గెలిస్తే ఎం చేస్తారో ఆలోచంచండి. ఇక్కడి నేతలు పార్లమెంట్ ను స్తంబింబచేసి తెలంగాణ తెచ్చిండ్రు. సొంత ఆస్తులు కరగబెట్టి సేవ చేసిండ్రు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని పేర్కొన్నారు. 


‘మంత్రి పదవిని త్యాగం చేసి, నల్గొండ గడ్డపై ఆమరణ నిరాహార దీక్ష చేసిన వ్యక్తి కోమటిరెడ్డి. భూమికి మూరేడు లేని వానికి చెప్తున్నా.. కోమటిరెడ్డి బ్రదర్స్ మందులో సోడా కలిపి రాలేదు. నాతో పాటు ముఖ్యమంత్రి అర్హత కలిగిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. స్థానిక నాయకులు ఎవరైనా అందరు ఎప్పుడైనా నన్ను కలవచ్చు. గడీల గోడలు బద్దలు కొట్టి జ్యోతిరావ్ పూలె పేరు పెట్టినం. వామపక్ష నేతల మద్దతుకు, గౌరవానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేశారు. I.N.D.I.A కూటమి గెలుపుతో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. బీఆర్ఎస్ ఏమైనా సీట్లు గెలిస్తే బీజేపీ కి మద్దతు ఇస్తుంది. కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారు. 


3 నెలల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం 
నిరుద్యోగుల ఆశలకు గండి గొడితే ప్రజా పాలనలో మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ లో ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినం. రాజీవ్ ఆరోగ్య శ్రీని పది లక్షలకు పెంచినం. ఉచిత కరెంటు బిల్లు ఇచ్చినందుకు ఓడగొడుతారా. బీజేపీ నాయకులను అడుగుతున్న.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. రాష్ట్ర అవతరణ కు అడ్డు పడిన  బీజేపీ కి ఓట్లు అడిగే హక్కు లేదు. భువనగిరిలో బిఆరెస్ బీజేపీకి మద్దతు ఇస్తుంది. బీర్ల ఐలయ్య కు విప్ ఇచ్చినం, అనిల్ కు రాజ్య సభ ఇచ్చినం. బలహీన వర్గాలకు సామజిక న్యాయం చేసినం. యాదాద్రి పేరు యాదగిరి గుట్ట గా మారుస్థాం. గందమళ్ళ, బ్రాహ్మణ వెళ్లెంల, slbc పూర్తి చేస్తాం. ఆగస్టు 15 లోపు యాదగిరి లక్ష్మీనర్సింహా స్వామి సాక్షిగా రెండు లక్షల రుణ మాపి చేస్తామన్నారు. వచ్చే పంటకు 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొంటామని’ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.