Nalgonda News : వైద్యుల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణం మీదకు తెచ్చింది. నల్కొండ సెంట్రల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. జ్యోతి అనే మహిళ డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు ఆపరేషన్ చేసి డెలవరీ చేశారు. డెలవరీ అనంతరం దూదిని డాక్టర్లు కడుపులోనే ఉంచి కుట్లు వేసేశారు. దూది కడుపులో ఉండిపోవడంతో బాధిత మహిళ మూడు రోజులపాటు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ విషయంపై బాధిత మహిళ బంధువులు ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులను అడగగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని మహిళ బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బాధ్యులపై చర్యల తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 


వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి! 


ఉమ్మడి నల్గొండ జిల్లాలో వట్టి ఖమ్మం పహాడ్ గ్రామానికి చెందిన పద్మ(55) అనే మహిళ అనారోగ్యంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయింది. వైద్యులు సరిగ్గాచూడకపోవడం వల్ల పద్మ పరిస్థితి   మరింత విషమించి మృతి చెందిందని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అంబులెన్స్ లో స్వగ్రామానికి పద్మ మృతదేహాన్ని తరలిద్దామని అనుకుంటే, అంబులెన్స్ రిపేర్ లో ఉందని తెలిపారు. పద్మ కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు కూడా లేకపోవడంతో దాతల సహాయంతో చివరకు ప్రైవేట్ అంబులెన్స్ లో మృతదేహాన్ని తరలించారు. దీంతో మహిళా బంధువులు ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు సరిగ్గా చూసుకోకపోవడం వల్లే పద్మ పరిస్థితి విషమించిందని ఆరోపిస్తున్నారు. చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. 


పసికందును కొరికేసిన ఎలుకలు 


ఝార్ఖండ్ రాష్ట్రం గిరిధ్ జిల్లా ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ పసికందు ప్రాణాల మీదకు వచ్చింది. రెండు రోజుల పసికందు కాళ్లను ఎలుకలు కొరికేశాయి. ఈ పసికందు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నర్సులను విధుల నుంచి తొలగించారు. డ్యూటీలో ఉన్న వైద్యుడిపై చర్యలకు ఆదేశించారు. ఏప్రిల్ 29న మమతాదేవి అనే మహిళ ఆడిపిల్లకు జన్మనిచ్చింది. శిశువు శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతుండటంతో చికిత్స కోసం గిరిధ్ జిల్లా ఆస్పత్రిలోని చిన్న పిల్లల వార్డుకు తరలించారు. అయితే ఆ పసికందును పరీక్షించిన వైద్యులు పాప జాండిస్ బారిన పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో పాపకు అక్కడే చికిత్స అందిస్తున్న క్రమంలో ఎలుకలు మోకాళ్ల కింది భాగంలో దారుణంగా గాయం చేశాయి.