Nagarjuna responded that the demolition of the N Convention :  ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చట్ట విరుద్దమని నాగార్జున స్పష్టం చేశారు. తనకు చెందిన కన్వెన్షన్ సెంటర్ ను చెరువు పూడ్చి నిర్మించారని కూల్చి వేయడంతో స్పందించారు. పూర్తిగా పట్టా భూమిలో ఆ నిర్మాణం ఉందని.. ఒక్క ఇంచ్ కూా చెరువు ప్లాన్ కు విరుద్ధంగా లేదన్నారు. అయినా  గతంలో ఇచ్చిన నోటీసులపై న్యాయస్థానాలను ఆశ్రయించామని.. స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ.. కూల్చివేతలు చేపట్టారని నాగార్జున ఆరోపించారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానన్నారు. 







ప్రస్తుతం కూల్చివేతల కారణంగా జరుగుతున్న ప్రచారంతో తమ ప్రతిష్టకు మచ్చ ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ ప్రకటన చేస్తున్నట్లుగా నాగార్జున తెలిపారు.  కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందని స్పష్టం చేశారు. కూల్చివేసే ముందు కనీసం నోటీసులు అయినా ఇవ్వాలన్నారు. కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉయమే వచ్చి కూల్చివేశారని..  కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరి కాదన్నారు.  కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే తానే కూల్చి వేయించి ఉండేవాడినన్నారు. తాము తప్పనిసరిగా కోర్టును ఆశ్రయిస్తామని అక్కడ తమకు న్యాయం జరుగుతుంని నాగార్జున అన్నారు. 


నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై మొదటి నుంచి అనేక వివాదాలు ఉన్నాయి. టీడీపీ నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి  ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఎన్ కన్వెన్షన్ అంశాన్ని లేవనెత్తారు. తెంంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత .. ఆయన కన్వెన్షన్ సెంటర్ ఆక్రమణ అని చెప్పి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ తర్వాత ఆ విషయంలో ముందుకు సాగలేదు. చివరికి ప్రభుత్వం మారిన తర్వాత .. హైడ్రా ఏర్పాటు చేయడం.. చెరువుల కబ్జాలపై విరుచుకుపడటంతో.. ఎన్ కన్వెన్షన్ చరిత్రలో కలిసిపోయింది. ఈ విషయంలో నాగార్జున న్యాయపోరాటం ఎప్పుడు ప్రారంబిస్తారో కానీ..  ఇప్పటికైతే హైదరాబాద్‌లోని లగ్జరీ కన్వెన్షన్ సెంటర్లలో ఒకటిగా ఉన్న ఎన్ కన్వెన్షన్ మాత్రం.. కూలిపోయింది. 


నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడం కలకలం సృష్టించింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ తో పాటు ... ఆ చుట్టుపక్కల చెరువులో ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. నాగార్జున సినీ హీరో కావడంతో.. ఈ విషయం ఎక్కువగా  ప్రచారం అవుతోంది. గత కొన్ని రోజులుగా హైడ్రా చెరువుల్లో కబ్జాలను కూల్చివేస్తూనే ఉంది.