Rajgopal Reddy Sensational Comments: భవిష్యత్తులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కచ్చితంగా సీఎం అవుతారని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని.. తాను చెప్పింది తప్పక జరుగుతుందని అన్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నీటి పారుదల పనులపై భువనగిరిలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నల్లగొండ ప్రజల ఆశీర్వాదంతో మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో తప్పనిసరిగా సీఎం అవుతారు. నా నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయి. నేను ఏం చెప్పినా తప్పుకుండా జరుగుతుంది.' అని పేర్కొన్నారు.
అటు, పిల్లయిపల్లి, ధర్మారెడ్డి కాలువలను రీడిజైన్ చేయాలని కోరారు. కాలువల వెడల్పు పెంచడం ద్వారా ఆయకట్టు డబుల్ అవుతుందని చెప్పారు. అధికారులు దూరదృష్టితో ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిల్, వేముల వీరేశం, మల్ రెడ్డి రంగారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు సైతం పాల్గొన్నారు.
Also Read: Revanth Reddy: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు - సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం