Happy Birthday Harish Rao: హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ, సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు, ఆయనకరు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు బావ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషెస్ తెలిపారు. ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు తన ట్వీట్‌లో కవిత పేర్కొన్నారు.
తిరుమలలో మంత్రి హరీష్ రావు..
తిరుపతి : తిరుమల శ్రీవారిని తెలంగాణ ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు.. ఇవాళ (శుక్రవారం) వేకువజామున స్వామి వారి అభిషేక సేవలో హరీష్ రావు తన కుమారుడుతో కలిసి పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
కాలినడకన తిరుమలకు..
నేడు తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి హరీష్ రావు గురువారం రాత్రి కాలినడకన తిరుమల చేరుకున్నారు. హరీష్ రావు తిరుమల పర్యటన సందర్భంగా టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. నేటితో 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా తిరుమల శ్రీవారి ఆశీస్సులు పొందడానికి తిరుమలకు విచ్చేసినట్లు దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావు తెలిపారు.
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు సిద్దిపేటలో పలు సేవాల కార్యక్రమాలు చేపట్టారు. అయితే ప్రజలకు ఉపయోగపడే పనుల ద్వారా మాత్రమే తన బర్త్ డే ఈవెంట్లు చేపట్టి వేడుకలు జరపాలని పార్టీ శ్రేణులకు, తన అభిమానులకు హరీష్ రావు గురువారం నాడు సూచించారు.
Also Read: Revanth Reddy US Tour-కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ-రేవంత్ రెడ్డి