MLA Sudheer reddy: కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీంగా మారిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. కోర్టులో నడుస్తున్న కేసునే మళ్లీ కొత్తగా పీఎస్ లో ఫిర్యాదు చేశారని అన్నారు. షెడ్యూల్ 10 ప్రకారమే తాము ఆనాడు టీఆరెస్ లో విలీనం అయ్యామని చెప్పుకొచ్చారు. రాజస్థాన్ బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ లో చేరలేదా అని ప్రశ్నించారు. తమ శాసన సభా పక్షాన్ని విలీనం చేయలేదా అన్నారు. గోవాలో కాంగ్రెస్ శాసన సభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేస్తే రేవంత్ రెడ్డికి తప్పుగా కనిపించడం లేదా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి బీజేపీ డైరెక్షన్ లోనే స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఆరోపించారు. అలాగే రేవంత్ రెడ్డి ఆనాడు టీడీపీకి రాజీనామా లేఖను స్పీకర్ కు ఇవ్వకుండా... చంద్రబాబుకు ఎందుకు ఇచ్చారో చెప్పాలన్నారు. సైకిల్ నుంచి హస్తం పార్టీలో చేరినప్పుడు రేవంత్ రెడ్డి ముడుపులు తీసుకుంటే.. మేము కూడా తీసుకున్నట్లే అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వివరించారు. 



"బీజేపీని బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి"


రాజస్థాన్ లో బీఎస్పీ ఎమ్మెల్యేలకు సోనియా గాంధీ ముడుపులు ఇస్తే.. మాకు కూడా ఇచ్చినట్లన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చి గవర్నర్ పాలనను పెట్టింది నిజం కాదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఓటుకు నోటుకు కేసులో అడ్డంగా కెమెరాలకు దొరికిన రేవంత్ రెడ్డి... ఈరోజు తమపై ఫిర్యాదు చేయడం విడ్డురంగా ఉందన్నారు. దేశంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తుంటే.. కాంగ్రెస్ నాయకులు మాత్రం కాంగ్రెస్ తోడో యాత్ర చేస్తున్నారన్నారు. బీజేపీని బలోపేతం చేసేందుకు రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ వీక్ అయిందని తెలిపారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకోని.. చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇచ్చింది నిజం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే చిరంజీవి, జ్యోతిరాదిత్య సింహ చేరికలు తప్పు కానప్పుడు మాది తప్పు ఎలా అవుతుందన్నారు. ఆనాటి పీసీసీ డీఎస్ పార్టీలోకి అందరికి స్వాగతం పలికారని గుర్తు చేశారు. 



రాష్ట్రాల ప్రభుత్వాలను కులగొట్టే ఆనవాయితీని కాంగ్రెస్ నుంచి బీజేపీ కొనసాగిస్తోందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విమర్శించారు. పశ్చిమ బెంగాల్ లో ప్రధాని మోదీ స్వయంగా బహిరంగ సభలో టీఎంసీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని చెప్పింది దేశం అంతా విందని చెప్పుకొచ్చారు. దంగ రాజీనామ చేసి అధికార కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి పాల్గొనలేదా అని అడిగారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము ఆనాడు పార్టీ మారినట్లు స్పష్టం చేశారు. బీఅరెస్ లో చేరాము కాబట్టే తమ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని వివరించారు. నియోజకవర్గ అభివృద్ధి పై చర్చకు ఎక్కడైనా సిద్ధం అని తేల్చి చెప్పారు. సీబీఐ, ఈడీని కోర్టు ద్వారా తమపై అక్రమ దాడులు చేయించే కుట్రలో భాగమే రేవంత్ ఫిర్యాదని చెప్పారు.