మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చే భక్తులకు వసతుల్లో ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి సత్యవతి రాథోడ్.. భక్తులు మెచ్చేలా శాశ్వతమైన ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలన్నారు. ములుగు జిల్లా మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలన చేసి, జిల్లా అధికారులతో మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష చేశారు.
2022 ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడారు. భక్తుల వసతి సౌకర్యాలపై మేడారం ప్రాంతమంతా తిరిగి పర్యవేక్షించారు. సమక్క-సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి చoద్ర శేఖర్ రావు ఆదేశాల మేరకు జాతరలో ఏ ఒక్క లోటు లేకుండా అన్న ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కిందటి ప్రభుత్వాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చాక శాశ్వత ప్రాతిపాదికన బడ్జెట్ కేటాయించడం జరిగిందని అన్నారు. జాతరలో ఆరోగ్య శాఖ సేవలు ముఖ్యమన్నారు. భక్తులు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి జాతరకు రావలసిందిగా అవగాహన కల్పించాలని అన్నారు.
మేడారం జాతర పనులలో క్వాలిటీ ప్రమాణాలను పాటించాలని ములుగు ఎమ్మెల్సే సీతక్క కోరారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ , మెడికల్ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. జాతర వరకు రోడ్లను పూర్తి చేయాలని అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు పసుపు, కుంకుమ బంగారాన్ని ప్రసాదంగా ఇవ్వాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ప్రతి పైసా ప్రజలదని, పనులు నాణ్యంగా చేపట్టాలని జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్ అన్నారు. రెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే మేడారం జాతరకు శాశ్వత పనులు చేపట్టాలన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. పై అధికారుల ఆదేశాలు పాటిస్తూ, జనవరి మొదటి వారంలోగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.
Also Read: శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?
Also Read : ఏపీకి వరద సాయం రూ.895 కోట్లిచ్చాం .. విజయసాయిరెడ్డికి కేంద్రమంత్రి ఆన్సర్ !
Also Read: సీతారాముడూ వెళ్లిపోయాడు.. ఇన్నాళ్లూ వెన్నెల కురింపించి.. నేడు చీకట్లలో వదిలేసి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి