BRS Corporators Arrest :  రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు చేశారు. డిప్యూటీ మేయర్ జగదీశ్వర్ రెడ్డి ఆఫీస్ లో బీఆర్ఎస్ నాయకుల పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. ఈ దాడిలో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ మేయర్ జగదీశ్వర్ రెడ్డితో పాటు 7 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్ట్ అయ్యారు. మరో 6 బిల్డర్స్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి పీర్జాధిగుడా కార్పొరేషన్ లోని సాయి ప్రియ సర్కిల్  వద్ద జగదీశ్వర్ రెడ్డి కార్యాలయంలో పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో పీర్జాధిగుడా డిప్యూటీ మేయర్, కోఆప్షన్ నంబర్, మరికొంత మంది కార్పొరేటర్లు అరెస్టు అయ్యారు.

  


మొత్తం 13 మంది అరెస్టు 


రాచకొండ మేడిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో 13 మంది పట్టుబడ్డారు. వీరిలో బీఆర్ఎస్ నేతలను కూడా ఉన్నారు.  పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్‌తో పాటు ఏడుగురు కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఆరుగురు బిల్డర్లను ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికులు సమాచారంతో పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. కొంతకాలంగా ఈ స్థావరంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బీఆర్ఎస్ నేతల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాత్రి సమయంలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులు తెలిపారు. లక్షల్లో డబ్బులు పెట్టి పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు అంటున్నారు. మేడిపల్లిలోని డిప్యూటీ మేయర్ కు చెందిన ఆఫీస్ లో  బీఆర్ఎస్ నేతలు కలిసి పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు. పోలీసుల రాకను గమనించి కొంతమంది అక్కడి నుంచి పారిపోయారు. అరెస్ట్ చేసిన వారి నుంచి నగదు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఏకంగా 13 మంది బీఆర్ఎస్ నేతలు పేకాట ఆడుతూ పట్టుబడటం స్ధానికంగా కలకలం రేగింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. పేకాట ఆడితే ఎంతటివారిపైనైనా  చర్యలు తీసుకుంటామని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.