ఏదైనా సమస్య వస్తే న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతాం. అయితే మెదక్ లో కోర్టే బాధితురాలి కోసం వచ్చింది. బాధితురాలి సమస్య తెలుసుకున్న జడ్జి నేరుగా ఆమె ఇంటికి వెళ్లారు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. శివంపేట మండలం శభాశ్ పల్లికి చెందిన వృద్ధురాలు శివమ్మకు పింఛన్ రావడంలేదు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. తన గోడును నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత దృష్టికి వెళ్లింది వృద్ధురాలు శివమ్మ. దీంతో జడ్జి అనిత బాధితురాలి ఇంటికి వెళ్లారు. జడ్జి అనిత జిల్లా కలెక్టర్ హరీశ్‌కు ఫోన్ చేసి శివమ్మకు పింఛన్ మంజూరు అయ్యేలా చూడాలన్నారు. బాధితురాలికి తగిన న్యాయం చేస్తామని కలెక్టర్ శివమ్మకు హామీ ఇచ్చారు. సమస్య పరిష్కరించేదుకు నేరుగా జడ్జి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.


Also Read: టెన్షన్ వద్దు మిత్రమా.. చుక్కల మందు టీకా ట్రయల్స్‌కు అనుమతి వచ్చేసింది


సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కు ఫోన్


పింఛన్ రాక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న బాధితురాలి గురించిన తెలుసుకున్న జడ్జి అనిత... నేరుగా ఆమె ఇంటికి వెళ్లిన విషయం తెలుసుకున్నారు. శభాశ్‌పల్లికి చెందిన శివమ్మకు గత రెండున్నరేళ్లుగా పింఛను రావడం లేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పింఛను నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు. దీంతో శివమ్మ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పైగా వయసుతో పాటు వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. శివమ్మ సమస్య నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత దృష్టికి వచ్చింది. వెంటనే బాధితురాలి ఇంటికి వెళ్లిన జడ్జి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెకు పండ్లు ఇచ్చి సమస్య తెలుసుకున్నారు. ఎప్పటి నుంచి పింఛను రావడం లేదో వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా న్యాయమూర్తే తన సమస్య తెలుసుకుని ఇంటికి రావడంతో వృద్ధురాలు భావోద్వేగానికి గురయ్యారు. జడ్జితో తన గోడు వెళ్లబోసుకుంది. జడ్జిని చూసిన వృద్ధురాలు మీ కాళ్లు మొక్కుతా ఎలాగైనా పింఛను ఇప్పించండని వేడుకున్నారు. శివమ్మకు పింఛను వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం న్యాయమూర్తి జిల్లా కలెక్టర్ హరీశ్‌తో ఫోన్ లో మాట్లాడారు. వృద్ధురాలికి పింఛన్ మంజూరయ్యే చూడాలన్నారు. కలెక్టర్.. శివమ్మకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామానికి న్యాయమూర్తితో పాటు న్యాయవాదులు, న్యాయసేవాధికార సంస్థ సభ్యులు వచ్చారు.  


Also Read: కూలీల వాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్... పనికి వెళ్తూ అనంతలోకాలకు...నలుగురు మృతి, 8 మందికి గాయాలు