MLA Prem Sagar Rao counters to Balka Suman: రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ వ్యాఖ్యలను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన బాల్క సుమన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ ఎక్కడో వేరే జిల్లా నుంచి వచ్చి మంచిర్యాల జిల్లాలో పెద్దతనం చేస్తానంటే కుదరదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లడుతూ చెప్పు చూయిస్తూ అసభ్యకర మాటలతో మాట్లాడడం సరైనది కాదని అన్నారు.


బాల్క సుమన్ ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ కార్యకర్తలు రేపటి నుంచి అడుగడుగునా బాల్క సుమన్ కు తగిన శాస్తి చేస్తారని అన్నారు. ఇక్కడ ఎవరి ఆటలు కొనసాగవని.. త్వరలో కాంగ్రెస్ కార్యకర్తలు బాల్క సుమన్ కు తగిన శాస్తి చేయడం ఖాయమని, అప్పుడే అందరికి అర్థమవుతుందని అన్నారు. బాల్క సుమన్ చేసిన ఆగడాలు, రాసలీలలు అన్ని త్వరలో బయటపెడతానని అన్నారు.


బాల్క సుమన్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు


బాల్క సుమన్ చెప్పుతో కొడతా అని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై చెప్పు చూపిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల అతడిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు గజ్జల హేమలత, పట్టణ మైనార్టీ అధ్యక్షులు నజీర్, యూత్ కాంగ్రెస్ నాయికిని సురేందర్, NSUI పట్టణ అధ్యక్షులు వెంకట సాయి, కాంగ్రెస్ నాయకులు కలువల జగన్ శ్రీనివాస్ గౌడ్, బోల్లం భీమన్న ,కంకణాలు శ్యామ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


బాల్క సుమన్ వ్యాఖ్యలు ఇవీ


మంచిర్యాల జిల్లాలో పార్లమెంటు స్థాయి సమావేశంలో రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. చెప్పుతో కొడతా నా కొడకా అంటూ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ పై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేయడంపై బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణను సాధించిన నాయకుడు కేసీఆర్ ను లంగా అని మాట్లాడుతున్నాడు రండగాడు.. హౌలే గాడు రేవంత్ రెడ్డి’’ అని బాల్క సుమన్ వ్యాఖ్యనించారు. చెప్పు తీసుకొని కొట్టినా తప్పులేదని చేతుల్లోకి చెప్పు తీసుకుని మరీ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నాం అంటూ మాట్లాడారు.


ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి పదవిని బట్టి స్థాయిని బట్టి మాట్లాడాలని అన్నారు. రైతు బంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామంటున్నారని ఆరోపించారు. ఆటో డ్రైవర్లు తిన్నది అరగక ధర్నాలు చేస్తున్నారని అహంకారంతో మాట్లాడుతున్నారన్నారని అన్నారు. రైతుబంధు కోసం గ‌త ప్రభుత్వంలో విడుద‌ల చేసిన రూ.7,700 కోట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి రాఘ‌వ క‌న్‌స్ట్ర‌క్ష‌న్‌కి, కాంగ్రెస్ కంట్రాక్ట‌ర్ల‌కి జేబుల్లోకి మలుపుకొని రైతుల నోట్లో మట్టి కొట్టారని ఆరోపణ చేశారు.