తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నా ప్రజలకు ప్రయోజనాలు అందడం లేదని, కేవలం సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే ఆర్థికంగా ఎదుగుతోందని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. సీసీఐ సంగతి సరే సరి.. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందని సరిపెడుతున్నారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేతుల్లోనే ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ గురించి మంత్రి కేటీఆర్ ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు.


నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకుంటామని స్వయంగా మంత్రి కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత ఇక్కడ ప్రచారం చేస్తుండగా మాటిచ్చారని మధుయాష్కీ గుర్తుచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో కవిత ప్రచారం చేస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేవలం వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరినీ ప్రభుత్వ పరం చేసుకుంటామని హామీ ఇచ్చారని.. అయితే ఇన్నేళ్లయినా ఎందుకు హామీ ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలన్నారు.   


ఆసియాలో అతిపెద్ద షుగర్ ఫ్యాక్టరీ.. కానీ!
దాదాపు 16 వేల ఎకరాల్లో ఏర్పడిన బోధన షుగర్ ఫ్యాక్టరి ఆసియాలోనే అతిపెద్దదని తెలిసిందే. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాది తిరగకుండానే ఫ్యాక్టరీ మూతబడి ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. మరోవైపు షుగర్ ఫ్యాక్టరీకి చెందిన వేలాది ఎకరాల స్థలం కబ్జాకు గురవుతున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన నేతలే ఫ్యాక్టరీ భూములును కబ్జా చేస్తున్నారనే ఆరోపణలున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.


కేటీఆర్‌వి ఉత్తర కుమార ప్రగల్భాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏనాడూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతడపడలేదని.. దీని ద్వారా స్థానికులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వానికి సూచించారు. రైతులకు దీని ప్రయోజనం కలుగుతుందని.. మంత్రి కేటీఆర్ ఇప్పటికైనా ఉత్తర కుమార ప్రగల్భాలు ఆపి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని డిమాండ్ చేశారు. పేదలకు, రైతులకు, నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత టీఆర్ఎస్ నేతలపై ఉందన్నారు.


Also Read: Suryapet Ragging: సూర్యాపేట ర్యాగింగ్ ఘటనలో గందరగోళం.. పరస్ఫర విరుద్ధంగా రిపోర్టు, ఇంకో ట్విస్ట్ కూడా..


Also Read: KCR On School Holidays: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు.. లాక్​డౌన్​పై క్లారిటీ


Also Read: Dharmana Krishna Das: జగన్ మళ్లీ అధికారం చేపట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.... డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి